E-Paper
Advertisement

Thriller movie OTT : కూతురి మిస్సింగ్ తో అడవిలో హడలెత్తిపోయే అడ్వెంచర్… ఓటీటీలోకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Thriller movie OTT : కూతురి మిస్సింగ్ తో అడవిలో హడలెత్తిపోయే అడ్వెంచర్…  ఓటీటీలోకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
Advertisement

Thriller movie OTT : థ్రిల్లర్ సినిమాలను క్రేజీగా చూస్తున్నారు ఆడియన్స్. థియేటర్లకు వెళ్లకుండానే వీటిని ఇంట్లోనే కూర్చిని చూసి ఆనందిస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమాలు డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నయి కూడా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థ్రిల్లర్ సినిమా ఈ రోజు నుంచి నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఒక అడవిలో కూతురి మిస్సింగ్ తో స్టోరీ నడుస్తుంది. ఇక తల్లి ఆమెను వెతికే క్రమంలో స్టోరీ ఉత్కంఠభరితమైన మలుపులు తీసుకుంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.  ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫైర్‌బ్రేక్’ (Firebreak). ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదు. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో మాత్రమే 2026 ఫిబ్రవరి 20 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. డేవిడ్ విక్టోరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో బెలెన్ క్యుస్టా, ఎన్రిక్ ఆకర్, జోక్విన్ ఫురియెల్, డయానా గోమెజ్ లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మారా అనే మహిళ తన భర్తను కోల్పోయిన బాధలో ఉంటుంది. ఆ బాధ నుండి కొంచెం ఉపశమనం పొందడానికి, తన కూతురు లిడేను తీసుకుని అడవి ప్రాంతంలో ఉన్న తమ పాత ఇంటికి వెళ్తుంది. అక్కడ తన బావ కుటుంబంతో కలిసి కొన్నాళ్లు ప్రశాంతంగా గడపాలని అనుకుంటుంది. కానీ వాళ్లు వెళ్లిన సమయంలోనే ఆ అడవిలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగుతాయి. ఆ మంటలు వేగంగా వాళ్ల వైపు దూసుకువస్తూ భయానక పరిస్థితిని సృష్టిస్తాయి.

అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉండగానే, మారా కూతురు లిడే అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఒకవైపు చుట్టుముడుతున్న మంటలు, మరోవైపు తన కళ్ల ముందే మాయమైన కూతురు—మారాకు ఏం చేయాలో అర్థం కాదు. తన బిడ్డను వెతికే క్రమంలో ఆమెకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అసలు ఆ పాప అడవిలోకి వెళ్ళిందా ? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా ? ఆ మంటల నుండి మారా తన కూతురిని ఎలా కాపాడుకుంది ? అనే విషయాలను, ఈ స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే సైకో… ఒక్కో మర్డర్ చూస్తే మతిపోవడం ఖాయం

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×