E-Paper
Advertisement

Thriller Movie OTT : ఐదుగురు హై ప్రొఫైల్ వ్యక్తులతో మోసం చేసే కాన్ మ్యాన్… క్లైమాక్స్ ట్విస్టుకు బుర్రపాడు

Thriller Movie OTT : ఐదుగురు హై ప్రొఫైల్ వ్యక్తులతో మోసం చేసే కాన్ మ్యాన్… క్లైమాక్స్ ట్విస్టుకు బుర్రపాడు
Advertisement

Thriller Movie OTT : సీను సీనుకో ట్విస్ట్ తో, ఊహించని మలుపులతో ఆద్యంతం ఆకట్టుకునేవే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు. అందుకే ఓటీటీలో స్పెషల్ గా ఇలాంటి సినిమాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. మీరు కూడా ఇలాంటి సినిమాల కోసం చూస్తుంటే గనక ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సినిమా పేరేంటి? కథ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘చతురంగ వేట్టై’ (sathuranga vettai). 2014లో విడుదలైన ఈ తమిళ క్రైం థ్రిల్లర్ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకుడిగా చేసిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాలో ఓ మోసగాడి జీవితాన్ని ఆకట్టుకునేలా చూపించారు. నటరాజ్ ఇందులో ప్రధాన పాత్రలో నటించగా, ఇషా తల్వార్, రాధిక ఆప్టే, వివేక్ మెయిన్ లీడ్స్ గా నటించారు. రెండు గంటల 18 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ మూవీకి ఐఎండిబిలో ఏకంగా 8.1 రేటింగ్ ఉండడం విశేషం. అప్పట్లో తమిళనాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ మూవీ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చూడొచ్చు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించగా, పాస్ట్ పేస్ట్ ఎడిటింగ్ తో సినిమా చివరి వరకు ఆడియన్స్ ని అలరిస్తుంది.

Advertisement

Also Read : ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

కథలోకి వెళ్తే…

సినిమా మొత్తం గురు అనే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. అతను ఓ గ్రామీణ యువకుడు, పైగా పేదవాడు. ఊర్లో బ్రోకర్ గా పని చేసి, ఇతరులను మోసం చేస్తూ ఈజీగా డబ్బు సంపాదించే తెలివితేటలు ఉంటాయి హీరోకి. పేదరికం నుంచి తప్పించుకొని తాను కన్న కలలను సహకారం చేసుకోవడమే అతని లక్ష్యం. కానీ ఈ క్రమంలో అతను ఓ రోజు ఓ పెద్ద మోసంలో చిక్కుకొని పోలీసులకు పట్టబడతాడు. ఫలితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇకనుంచి బయట పడ్డ తర్వాత మరింత బాగా మోసాలు ప్లాన్ చేయడం అలవాటు చేసుకుంటాడు. ఇక్కడే ఊహించని టర్న్ ఉంటుంది.

Advertisement

హీరో ఈసారి తన ఫస్ట్ బిగ్ టార్గెట్ గా ఒక బ్యాంక్ మేనేజర్ ని ఎంచుకుంటాడు. ఫేక్ ఐడీని సృష్టించి, బిజినెస్ మాన్ గా మేనేజర్ ని మోసం చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె మేనేజర్ కూడా మోసగాడే. దీంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యి, హీరోకే తిరిగి బెడిసి కొడుతుంది. ఈ ఫెయిల్యూర్ తో అతను మరింత రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈసారి రిచ్ విడోను టార్గెట్ చేసి ఆమెను ప్రేమలో పడేలా చేయాలని, ఆ తర్వాత ఆమె ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ కూడా అతను మరో మోసంలో చిక్కుకొని, ఒక బిగ్ గ్యాంగ్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఆమెతో హీరో ప్రయాణం ఎలా సాగింది? అనుకున్నట్టుగా ఆ అమ్మాయిని బురిడీ కొట్టించి ఆస్తిని కొట్టేశాడా? ఆ రౌడీల నుంచి ఎలా తప్పించుకున్నాడు? అన్నది కథ.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×