E-Paper
Advertisement

OTT Movie : ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

OTT Movie : ఇండియా నుంచి ఆస్కార్ వరకు వెళ్లే అద్భుతమైన సినిమాల సంఖ్య అతి తక్కువ. ఇంకా చెప్పాలంటే అలాంటి సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడిప్పుడే ఆస్కార్ రేంజ్ సినిమాల సంఖ్య ఇండియన్ సినిమాలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అలాంటి సినిమాలు తీయాలనుకునే మేకర్స్ అందరికీ స్ఫూర్తినిచ్చే సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. మమ్ముట్టి హీరోగా నటించిన ఒక బ్లాక్ బస్టర్ తాజాగా ఆస్కార్ ఈవెంట్ లో ప్రీమియర్ కావడం సంచలనంగా మారింది.

ఆస్కార్ వేదికపై ‘భ్రమయుగం’

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ మూవీ ‘భ్రమయుగం’ (Bramayugam). 2024 ఫిబ్రవరి 15న రిలీజ్ అయిన ఈ మూవీ 2026 ఫిబ్రవరి 12న లాస్ ఏంజిల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్ లో ప్రత్యేక ప్రదర్శనకు ఛాన్స్ కొట్టేసింది. ‘వేర్ ది ఫారెస్ట్ మీట్ ది సి’ అనే చలనచిత్రంలో ఈ చిత్రం కూడా చేరడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా జరిగిన అరుదైన విషయమని చెప్పాలి. చిన్న రాష్ట్రమైన కేరళలోని మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా ఇలాంటి ఘనత సాధించడం అన్నది ఇండియన్ సినిమాకి గర్వకారణం. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ విజన్ ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఇక మూవీ స్క్రీనింగ్ అవుతున్న టైంలో ఆడియన్స్ హర్షద్వానాలు చేస్తూ మమ్ముట్టిని బాలీవుడ్ లెజెండ్ గా పేర్కొన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి ‘భ్రమయుగం’ మూవీ వైరల్ గా మారింది.

Advertisement

Also Read : క్రైమ్ నుంచి సైన్స్ ఫిక్షన్‌ సినిమాల వరకు… నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ వెబ్ సిరీస్‌ల లిస్ట్

ఈ ఒక్క సినిమా మలయాళ ఇండస్ట్రీకి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘భ్రమయుగం’, ‘మమ్ముట్టి’ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో మమ్ముట్టి కొడుమూన్ పొట్టి అనే పాత్రలో నటించారు. బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో రూపొందిన ఈ సినిమాలో మమ్ముట్టి నటనకు ఏడవ కేరళ స్టేట్ ఫిలిం అవార్డు బెస్ట్ యాక్టర్ గా అవార్డు వరించింది. అంతేకాకుండా ఇందులో అర్జున్ అశోక్ తేవన్ గా, సిద్ధార్థ్ భరతన్ వంటవాడిగా నటించారు. ఇంతటి ఘనత సాధించిన ఈ మూవీకి 2025 నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో స్థానం దక్కకపోవడం పై ఇప్పటికే విమర్శలకు దారితీసింది. కాగా ఈ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ (Sony Liv) ఓటీటీలో మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ వెర్షన్ లలో అందుబాటులో ఉంది.  ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దొరికింది.

కథలోకి వెళ్తే

Advertisement

17వ శతాబ్దపు మలబార్ కోస్ట్ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. తక్కువ కులానికి చెందిన జానపద గాయకుడు తేవన్ ది ఇందులో ప్రధాన పాత్ర. పోర్చుగీస్ సైనికుల బానిసత్వం నుంచి తప్పించుకుని వచ్చి, అడవిలోని ఒక పాత భవనంలో ఆశ్రయం పొందుతాడు. అక్కడున్న ఏకైక వ్యక్తి కొడుమున్ పొట్టి అతనికి ఆహారం, ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటాడు. కానీ ఆ తర్వాత కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అతను అక్కడ ఆశ్రయం పొందడం కాదు కొడుమూన్ వలలో చిక్కుకున్నాడని, స్వేచ్ఛను కోల్పోతున్నాను అని గ్రహిస్తాడు. అంతేకాకుండా కొడుమూన్ నిజానికి ఒక మంత్రగాడు అనే విషయం బయట పడుతుంది. మరి ఆ తర్వాత తేవన్ చేసిన పని ఏంటి ? కొడుమూన్ చెర నుంచి తప్పించుకున్నాడా? అనేది మూవీ స్టోరీ.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×