E-Paper
Advertisement

Thriller movie OTT: చచ్చినా చావని అమ్మాయి… డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… ఉత్కంఠ రేపే ప్రతీ ఎపిసోడ్

Thriller movie OTT: చచ్చినా చావని అమ్మాయి… డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… ఉత్కంఠ రేపే ప్రతీ ఎపిసోడ్
Advertisement

Thriller movie OTT : కొరియన్ సిరీస్ లను చాలా ఉత్సాహంగా చూస్తున్నారు ప్రేక్షకులు. రొమాంటిక్ నుంచి థ్రిల్లర్ వరకు వస్తున్న ఈ సిరీస్ లు బాగా ట్రెండింగ్ లో కూడా ఉంటున్నాయి. ఇవి ఓవర్ డైలాగులతో కాకుండా, సాదాసీదాగా సాగిపోయే ఒక ఫ్యామిలీ డ్రామాలా సాగుతుంటాయి. ఒక్కసారి వీటికి అలవాటు పడితే మానుకోవడం కష్టమే. ఇక రీసెంట్ గా ఒక కొరియన్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది ఊహించని ట్విస్టులతో మతి పోగొడుతోంది. ఒక మర్డర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ, ఒక్కో ఎపిసోడ్ మైండ్ బ్లాక్ చేస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది ఆర్ట్ ఆఫ్ సారా’ (The Art of Sarah). దీనిని చు సాంగ్-యెన్ రచించగా, కిమ్ జిన్-మిన్ దర్శకత్వం వహించారు. ఇందులో సారా కిమ్‌గా షిన్ హ్యే-సున్ లీ, డిటెక్టివ్‌గా జున్-హ్యుక్ నటించారు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఫిబ్రవరి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సారా అనే ఒక అమ్మాయికి ఒక పెద్ద ఆశ ఉంటుంది. ఎలాగైనా సరే, పెద్ద హోదాలో ఉండాలననేదే ఆమె కోరిక. అందుకోసం అబద్ధాలతో ఒక పెద్ద నెట్‌వర్క్ అల్లేస్తుంది. తన పేరు మార్చుకుని, లేని గొప్పలు చెప్పుకుంటూ, పెద్ద పెద్ద హై సొసైటీ పార్టీల్లో తిరుగుతూ అందరినీ బురిడీ కొట్టిస్తుంది. ఒక సాదాసీదా అమ్మాయి, టౌన్‌లోనే మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా మారిపోతుంది కొద్ది రోజుల్లోనే. కానీ సీన్ కట్ చేస్తే.. అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఈమె పేరు బయటకి వస్తుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక మొండి డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అది అసలు మామూలు కేసు కాదు. చనిపోయిన అమ్మాయి అచ్చు సారా లాగే ఉంటుంది. దీంతో స్టోరీ మరింత ఇంటెన్స్ గా ఉంటుంది.

ఇక డిటెక్టివ్ ఈ కేసులో తవ్వే కొద్దీ, సారా మేకప్ వెనక ఉన్న అసలు ముఖం, ఆమె ఆడిన గోల్‌మాల్‌ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆమె కట్టుకున్న రంగుల లోకం పేకమేడలా కూలిపోయే టైమ్ దగ్గర పడుతుంది. అసలు ఆ హత్య చేసింది సారానేనా? లేక ఎవరైనా ఆమెను ఇరికించారా? అసలు చనిపోయిన అమ్మాయి ఎవరు ? అనేదే అసలు మ్యాటర్. ప్రతి ఎపిసోడ్‌లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ, చివరి వరకు ఆడియన్స్‌ని కుర్చీ అంచున కూర్చోబెట్టేలా ఈ థ్రిల్లర్ సాగుతుంది.

Advertisement

Read Also : తండ్రిని జైలుకు పంపే కూతురు… భర్త కోసం భార్య ఎదురుచూపులు… ఏడిపించే ఎమోషన్స్ కూడా

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×