E-Paper
Advertisement

Feel Good drama OTT: తండ్రిని జైలుకు పంపే కూతురు… భర్త కోసం భార్య ఎదురుచూపులు… ఏడిపించే ఎమోషన్స్ కూడా

Feel Good drama OTT: తండ్రిని జైలుకు పంపే కూతురు… భర్త కోసం భార్య ఎదురుచూపులు… ఏడిపించే ఎమోషన్స్ కూడా
Advertisement

Feel Good drama OTT : కొన్ని ఫీల్ గుడ్ సినిమాలు ఎమోషన్స్ తో గుండెను పిండేస్తుంటాయి. మనకు తెలియకుండానే మన కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. అలాంటి సినిమాలు గుండెల్లో ఏదో బరువు దిగిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక చైనీస్ మూవీ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో అయితే కన్నీళ్లు గ్యారెంటీగా వస్తాయి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఈ చైనీస్ హిస్టారికల్ డ్రామా మూవీ పేరు ‘కమింగ్ హోమ్’ (Coming Home). జాంగ్ యిమౌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చెన్ డామింగ్, గాంగ్ లీ, జాంగ్ హుయివెన్ నటించారు. ఇది 2015 సెప్టెంబరు 11న USలో విడుదలైంది. మొదటిసారిగా 2014 మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. IMDb లో ఈ చిత్రానికి 7.3/10 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా ప్రైమ్ వీడియో, ముబి ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చైనాలో ఒకప్పటి రాజకీయ కారణాలతో, యాన్షి ఆనే వ్యక్తి తన భార్యాపిల్లలకు దూరమై ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవిస్తాడు. తన భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో అతని భార్య ఫెంగ్ ప్రతిరోజూ ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే తండ్రి వల్ల తన కెరీర్‌కు ఇబ్బంది కలుగుతుందని భావించిన కూతురు, అతను జైలు నుండి తప్పించుకుని వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి మళ్ళీ పట్టించేస్తుంది. చాలా కాలం తర్వాత జైలు శిక్ష ముగిసిన యాన్షి తిరిగి ఇంటికి చేరుకుంటాడు. కానీ అప్పటికే కాలం చాలా మారిపోతుంది. భర్త మీద బెంగ వల్ల ఎక్కువగా ఆలోచించి, అతని భార్య ఫెంగ్ మతిమరుపు వ్యాధికి గురవుతుంది.

ఆమె తన భర్త కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటుంది కానీ, కళ్లముందు ఉన్న భర్తను మాత్రం గుర్తుపట్టలేకపోతుంది. అతను ఇంటికి వచ్చినా తన భర్త కాదని బయటకు పంపించేస్తుంది. తన భార్య జ్ఞాపకశక్తి తిరిగి రావాలని యాన్షి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆమె భర్త పక్కనే ఉన్నా, అతనితో కలిసి స్టేషన్‌కు వెళ్లి, తన భర్త కోసం బోర్డు పట్టుకుని ఎదురుచూస్తూ ఉండటం మనల్ని కలిచివేస్తుంది. చివరికి ఆమె తన భర్తను గుర్తుపడుతుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : టెన్షన్ పెట్టే వింత కలలు… కన్ఫ్యూజ్ చేసే ఖతర్నాక్ మిస్టరీ… దిమ్మతిరిగే క్లైమాక్స్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×