E-Paper
Advertisement

బుర్ర హీటెక్కించే థ్రిల్లర్ సినిమాలు… వీటి క్లైమాక్స్ మీ ఊహకు కూడా అందదు

బుర్ర హీటెక్కించే థ్రిల్లర్ సినిమాలు… వీటి క్లైమాక్స్ మీ ఊహకు కూడా అందదు
Advertisement

Thriller Movies on OTT : కొన్ని థ్రిల్లర్ సినిమాలు మన మెదడుకు పదును పెడతాయి. సీటు అంచున కూర్చోబెట్టి, తర్వాతి సీన్ ఏంటా అని ఊపిరి బిగబట్టేలా చేస్తాయి. ముఖ్యంగా హాలీవుడ్‌లో వచ్చిన కొన్ని క్లాసిక్ థ్రిల్లర్స్ క్లైమాక్స్ చూశాక, ఇది కదా సినిమా అంటే! అనిపిస్తుంటాయి. మీరు గనుక మెదడుకు పనిచెప్పే థ్రిల్లర్ కోసం చూస్తుంటే.. ఈ వీకెండ్ ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను ఖచ్చితంగా వాచ్ లిస్ట్‌లో చేర్చుకోండి. అవి ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1. Se7en (1995)

క్రైమ్ థ్రిల్లర్ల జాబితా తీస్తే ‘సెవెన్’ మొదటి వరుసలో ఉంటుంది. బైబిల్‌లో ఉన్న ఏడు రకాల పాపాల ఆధారంగా ఒక సీరియల్ కిల్లర్ హత్యలు చేస్తుంటాడు. ఇద్దరు డిటెక్టివ్‌లు అతన్ని పట్టుకునే క్రమంలో ఎదురయ్యే మలుపులు మెమరబుల్. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇది Amazon Prime Videoలో అద్దెకు అందుబాటులో ఉంది.

2. Memento (2000)

Advertisement

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వ ప్రతిభకు ఇది నిదర్శనం. ఇందులో హీరోకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుంది. తన భార్యను చంపిన వాడిని వెతకడం కోసం అతను తన శరీరంపైనే పచ్చబొట్లు పొడుచుకుంటాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, కథ రివర్స్ ఆర్డర్‌లో నడుస్తుంది. సినిమా చివరలో వచ్చే ట్విస్ట్ మీ బుర్రను ఖచ్చితంగా హీటెక్కిస్తుంది. దీనిని Amazon Prime Video, Lionsgate Playలో చూడవచ్చు

3. The Game (1997)

ఒక కోటీశ్వరుడైన హీరోకి అతని తమ్ముడు పుట్టినరోజు కానుకగా ఒక గేమ్ ఆడే అవకాశం ఇస్తాడు. ఆ ఆట మొదలయ్యాక హీరో జీవితం తలకిందులవుతుంది. తన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అసలు అది నిజంగా ఆటా లేక ఎవరైనా తనను చంపడానికి ప్లాన్ చేశారా? అనే సస్పెన్స్ చివరి నిమిషం వరకు కొనసాగుతుంది. ఊహించని క్లైమాక్స్ ఈ సినిమా హైలైట్. Netflix, Amazon Prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

4. Basic Instinct (1992)

Advertisement

ఇది ఒక ఎరోటిక్ థ్రిల్లర్. ఒక పాపులర్ రైటర్ రాసిన నవలల్లో జరిగినట్టే హత్యలు జరుగుతుంటాయి. ఆ రైటర్ కి, కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ కి మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇందులో షారన్ స్టోన్ నటన, ఆ ఇంటరాగేషన్ సీన్లు ఇప్పటికీ ఒక సంచలనం. Amazon Prime Videoలో ఇది లభిస్తుంది.

5. The Departed (2006)

లియోనార్డో డికాప్రియో నటించిన ఈ సినిమాలో మైండ్ బెండ్ ట్విస్ట్లు ఉంటాయి. ఒక క్రిమినల్ గ్యాంగ్‌లో పోలీస్ ఇన్‌ఫార్మర్ ఉంటే, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గ్యాంగ్‌స్టర్ మనిషి ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే వేట, ఆ ఇంటెన్స్ డ్రామా అద్భుతం. క్లైమాక్స్ లో వరుసగా వచ్చే మలుపులు చూస్తే షాక్ అయిపోతారు. Netflix, Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.

Read Also : ఇంటర్నేషనల్ లెవల్లో రచ్చ చేసిన ఆ యాడ్… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ మూవీ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×