E-Paper
Advertisement

ఇంటర్నేషనల్ లెవల్లో రచ్చ చేసిన ఆ యాడ్… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ మూవీ

ఇంటర్నేషనల్ లెవల్లో రచ్చ చేసిన ఆ యాడ్… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ మూవీ
Advertisement

Action Comedy Movie OTT : ఓటీటీలోకి హాలీవుడ్ నుంచి ఒక కామెడీ యాక్షన్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది.  ఇద్దరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు బ్రెజిల్‌లో జరిగే వరల్డ్ కప్‌లో ఒక కండోమ్ స్పాన్సర్‌షిప్ డీల్ కోసం ప్రయత్నిస్తారు. కానీ అక్కడ వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల పెద్ద గందరగోళం ఏర్పడి, ప్రాణాలతో బయటపడటానికి వాళ్ళు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. అయితే దీని కామెడీ కూడా బూతులతోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సినిమా.

ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ యాక్షన్ కామెడీ సినిమా పేరు ‘బాల్స్ అప్’ (Balls Up). ఈ సినిమా వెనుక ఉన్న అసలు సిసలు మేటర్ ఏంటంటే, దీనికి కథను అందించింది ‘డెడ్‌పూల్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన పాల్ వెర్నిక్, రెట్ రీస్. అందుకే ఇందులో కామెడీ చాలా మొరటుగా, యాక్షన్ అదిరిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను ఆస్కార్ విజేత పీటర్ ఫారెల్లీ డైరెక్ట్ చేయగా, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కథ బ్రెజిల్ నేపథ్యంలో సాగినప్పటికీ, షూటింగ్ మాత్రం ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో చేశారు. ఈ మూవీ సుమారు 1 గంట 44 నిమిషాల నిడివితో ఫాస్ట్ పేస్‌లో సాగుతుంది. ఇందులో మార్క్ వాల్‌బర్గ్, పాల్ వాల్టర్ హౌసర్‌తో పాటు ‘బోరాట్’ ఫేమ్ సాచా బారన్ కోహెన్ ఒక కీలక పాత్రలో నటించి పిచ్చెక్కించాడు. పక్కాగా చెప్పాలంటే, ఇది కేవలం పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఫుల్ మీల్స్ లాంటి యాక్షన్ కామెడీ సినిమా. ఈ సినిమా 2026, ఏప్రిల్ 15న నేరుగా ప్రైమ్ వీడియో (Prime Video) ఓటీటీలో విడుదలైంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

బ్రెజిల్‌లో జరిగే ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను అడ్డం పెట్టుకుని, ఒక క్రేజీ కండమ్ కంపెనీకి ప్రచారం కల్పించాలని ఇద్దరు మార్కెటింగ్ చేసే వాళ్ళు అక్కడికి వస్తారు. వెళ్లిన పని తిన్నగా చేసుకోకుండా, ఒకరోజు రాత్రి ఫుల్‌గా మందు కొట్టి రచ్చ రచ్చ చేస్తారు. ఆ మత్తులో వీళ్లు చేసిన ఒక వెధవ పని వల్ల బ్రెజిల్ టీమ్ వరల్డ్ కప్‌ గెలిచే ఛాన్స్ మిస్ అయిపోతుంది. అది కాస్తా వైరల్ అవ్వడంతో దేశం మొత్తం వీళ్ల మీద పగబడుతుంది.
కట్ చేస్తే ఊరంతా వీళ్లని కొట్టడానికి ఉరుకులాడుతుంటారు. ఒక పక్క పిచ్చి కోపంతో ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్, ఇంకో పక్క అక్కడి లోకల్ రౌడీలు, పోలీసులు.. ఇలా అందరూ వీళ్ల ప్రాణాలు తీయడానికి వేట మొదలుపెడతారు. దొరికితే చట్నీ అయిపోతామని తెలిసిన ఆ ఇద్దరు , ఆ దేశం దాటి ఎలాగైనా ప్రాణాలతో పారిపోవాలని చేసే ప్రయత్నాలే అసలు సినిమా. మొత్తానికి ఇది ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా. పచ్చి బూతులు, పిచ్చి యాక్షన్, నవ్వు తెప్పించే సీన్లతో సినిమా మొత్తం గందరగోళంగా సాగుతుంది. అయితే ఈ సినిమా పిల్లలతో కలిసి చూసేది కాదు, కేవలం పెద్దోళ్ల కోసం మాత్రమే.

Read Also : గ్యాంగ్స్టర్లు గన్ లు.. మధ్యలో ఒకే ఒక్క పోలీస్… ఈ యాక్షన్ సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరబ్బా

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×