E-Paper
Advertisement

శ్మశానం పక్కనే పాడుబడ్డ హాస్టల్‌… దెయ్యాల టెన్షన్ తో పిచ్చెక్కిస్తున్న మలయాళ కామెడీ హారర్

శ్మశానం పక్కనే పాడుబడ్డ హాస్టల్‌… దెయ్యాల టెన్షన్ తో పిచ్చెక్కిస్తున్న మలయాళ కామెడీ హారర్
Advertisement

Horror Comedy OTT : మరో మలయాళం హారర్ కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శ్మశానం పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ హాస్టల్‌లో దెయ్యాలు ఉన్నాయని, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఆ పాడుబడ్డ హాస్టల్‌లోకి వెళ్తారు. ఆ తరువాత ఆసలు స్టోరీ ఆసక్తిగా సాగుతుంది. ఈ మలయాళం సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే నవ్వించింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను కూడా ఎంటర్టైన్ చేస్తోంది. వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాను ఎంచక్కా చూసేయచ్చు. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళ్తే..

సన్ నెక్ట్స్‌లో (Sun NXT)లో స్ట్రీమింగ్

ఈ మలయాళ హారర్ కామెడీ మూవీ పేరు ‘కనిమంగళం కోవిలకం’ (Kanimangalam Kovilakam). ఈ సినిమా యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందిన ‘కనిమంగళం కోవిలకం’ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందింది. వెబ్ సిరీస్‌లో నటించిన అజ్మల్ ఖాన్ AA, అబ్బి క్రిష్ వంటి ప్రధాన నటీనటులే వెండితెరపై కూడా తమ పాత్రలను కొనసాగించారు. రాజేష్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, కేవలం భయపెట్టడమే కాకుండా, కడుపుబ్బా నవ్వించే కామెడితో కూడా సాగుతుంది. ఇది 2026 జనవరి 16న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. సుమారు 122 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని క్లాప్‌బోర్డ్ ఫిల్మ్స్, బ్రిటిష్ సినిమాస్ నిర్మించాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఈ సినిమా డిజిటల్ హక్కులను Sun NXT సంస్థ దక్కించుకుంది. ఇది 2026 ఏప్రిల్ 10 నుండి సన్ నెక్ట్స్‌లో (Sun NXT)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ ముగ్గురు కుర్రాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ముగ్గురూ కలిసి ఒక పాత కాలపు బిల్డింగ్‌లో ఉన్న హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ఆ హాస్టల్ బిల్డింగ్ పక్కనే ఒక పాత శ్మశానవాటిక ఉంటుంది. ఆ శ్మశానవాటిక నుండి ఆత్మ తమ హాస్టల్‌లోకి వస్తోందని, తమ చుట్టూ ఏదో జరుగుతోందని ఆ ముగ్గురు స్నేహితులు గమనిస్తారు. ఆ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో వాళ్ళు పడే పాట్లు చాలా నవ్వు పుట్టిస్తాయి. ఒకవైపు భయంకరమైన దెయ్యం కనిపిస్తూ భయపెడుతుంటే, మరోవైపు ఆ కుర్రాళ్లు చేసే పనులు కామెడీని పండిస్తాయి. అసలు ఆ శ్మశానవాటికలో ఉన్న రహస్యం ఏంటి? ఆ ఆత్మకు, ఆ హాస్టల్ ఉన్న సంబంధం ఏంటి? ఆ అతీంద్రియ శక్తిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎలా బయటపెట్టారు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : పగతో రగిలే తల్లులు… చచ్చినోన్ని బతికించి తీర్చుకొనే భయంకరమైన ప్రతీకారం… ఓటీటీలో తెగ భయపెడుతున్న థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×