E-Paper
Advertisement

Thriller Series OTT : అప్పులు చేసి కొన్న కొంపతో తిప్పలు… కిడ్నాప్ తో చిక్కులు… స్ట్రీమింగ్ కి మరో కే డ్రామా రెడీ

Thriller Series OTT : అప్పులు చేసి కొన్న కొంపతో తిప్పలు… కిడ్నాప్ తో చిక్కులు… స్ట్రీమింగ్ కి మరో కే డ్రామా రెడీ
Advertisement

Thriller Series OTT : ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. ఇక అది తీరకుంటే ఒక రేంజ్ లో పిచ్చి కూడా ఉంటోంది. ఆ పిచ్చినే ఇక్కడ కథగా తీశారు. దక్షిణ కొరియాలో రియల్ ఎస్టేట్ పట్ల ఉన్న పిచ్చిని, ఒక సిరీస్ గా తీసుకొచ్చారు. భారీ అప్పులు చేసి ఒక ఇంటిని కొన్న కథానాయకుడు, ఆ అప్పుల వల్ల ఎలాంటి సమస్యలు కొనితెచ్చుకున్నాడనేదే ఈ స్టోరీ. ఈ కొరియన్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకునే సిరీస్ ఇది. థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనుంది ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియా క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘మ్యాడ్ కాంక్రీట్ డ్రీమ్స్’ (Mad Concrete Dreams). ఇందులో ప్రముఖ నటుడు హా జంగ్-వూ దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ తో తిరిగి వస్తున్నారు. ఆయనతో పాటు ఇమ్ సూ-జుంగ్, కిమ్ జున్-హాన్, క్రిస్టల్ జంగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక 2026 మార్చి 14నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి యిమ్ పిల్-సుంగ్ దర్శకత్వం వహించగా, ఓ హాన్-కీ దీనికి కథను అందించారు. ఇది మార్చి 14 నుండి ప్రతి శని, ఆదివారాల్లో tvN ఛానల్‌లో ప్రసారమవుతుంది. అంతర్జాతీయంగా HBO Max, Rakuten Viki ఓటీటీల్లో అందుబాటులో ఉంటుంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథలో హీరో సు-జంగ్ కి ఒక సొంతింటి కల ఉంటుంది. దానిని నెరవేర్చుకునేందుకు, ఉన్నవి లేనివి అన్నీ ఊడ్చేసి, నెత్తి మీదకి అప్పులు తెచ్చుకుని మరీ ఒక బిల్డింగ్ కొనేస్తాడు. తీరా కొన్నాక తెలిసొస్తుంది ఆ అప్పుల కిస్తీలు కట్టడం తన వల్ల కాదని. ఇల్లు గడవడమే కష్టమైపోతుంది. ఒక పక్క బ్యాంకోడు వచ్చి పీక మీద కూర్చుంటాడు. ఇక లాభం లేదనుకుని, ఆ అప్పుల ఊబిలోంచి బయటపడటానికి హీరో ఒక టెర్రిఫిక్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే… ఒక నకిలీ కిడ్నాప్ డ్రామా ఆడదామని డిసైడ్ అవుతాడు. కానీ సీన్ కట్ చేస్తే, అతను వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి అసలు కిడ్నాపర్ల చేతిలోనే ఇరుక్కుంటాడు. అప్పటిదాకా కామెడీగా ఉన్న కథ కాస్తా ఒక రేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మారిపోతుంది. చివరకు ఆ కిడ్నాప్ డ్రామా ఏమిటి ? దానినుంచి హీరో బయట పడతాడా ? అసలు ప్రాణాల మీదకి ఎలా తెచ్చుకున్నాడు ? అతనికి సొంతిల్లు ఉటుందా ? ఊడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఓ వర్షం కురిసిన రాత్రి… ఫ్రెండ్ తమ్ముడితోనే యవ్వారం… ఐయండిబిలో టాప్ రేటింగ్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×