Romantic Series OTT : ఈమధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా కొరియన్ సిరీస్ లు దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఏ రొమాంటిక్ డ్రామా వచ్చినా, ఎపిసోడ్లు మొత్తం అయ్యేవరకు ఓ చూపు చూడాల్సిందే అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన రొమాంటిక్ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్ కి ఐయండిబిలో 8కి పైగా రేటింగ్ కూడా ఉంది. తనకంటే చిన్నవాడైన ఫ్రెండ్ తమ్ముని ప్రేమించే ఒక అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.
ఈ కొరియన్ రొమాంటిక్ సిరీస్ పేరు ‘సంథింగ్ ఇన్ ది రెయిన్’ (Something in the Rain). దీనికి అహ్న్ పాన్-సియోక్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో సన్ యే-జిన్, జంగ్ హే-ఇన్ నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ డ్రామా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది.
ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాకుండా, ఆఫీసులో బాసుల వేధింపులతో జిన్-ఆ అనే అమ్మాయి సతమతమవుతూ ఉంటుంది. ఈ సమయంలో తన చిన్నప్పటి ఫ్రెండ్ తమ్ముడు జూన్-హీ అనే కుర్రాడు ఆమెకు ఎదురు పడతాడు. అతను విదేశాల నుంచి తిరిగి వచ్చి, పొగరుగా కాకుండా, పద్ధతిగా ఉంటూ ఈమె వెంట పడతాడు. మొదట్లో వీడు నా తమ్ముడి లాంటోడు కదా అనుకున్నా, అతని చనువు చూసి ఆమె మనసు పారేసుకుంటుంది. ఒక రోజు వర్షంలో ఒకే గొడుగు కింద నస్తున్నప్పుడు ఈ ప్రేమ మరింత బలపడుతుంది. అలా ఒకరికొకరు ఇష్టపడి, లోకానికి తెలియకుండా దొంగచాటుగా ముద్దులు, ముచ్చట్లతో లవ్ ట్రాక్ నడిపిస్తారు.
కట్ చేస్తే వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలిశాక అసలు సినిమా మొదలవుతుంది. ప్రేమ గెలవాలంటే ఇన్ని తిప్పలు పడాలా అనే రేంజ్‌లో సీన్లు ఉంటాయి. మధ్యలో ఈమె పని చేసే ఆఫీసులో కూడా, ఆడవాళ్లను తక్కువ చేసి చూసే బ్యాచ్‌తో ఈమె ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. చివరికి వీళ్ళ ప్రేమకు శుభం కార్డ్ పడుతుందా ? ఆఫీసులో బాసు వేధింపులను ఆమె ఎలా తిప్పికొడుతుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ… అడ్డంగా బుక్కయ్యే డెలివరీ బాయ్… క్లైమాక్స్ వరకు సాగే థ్రిల్లింగ్