BigTV English

Romantic Thriller Movies In OTT : ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్..

Romantic Thriller Movies In OTT : ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్..

Romantic Thriller Movies In OTT : ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థల్లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. కొత్త కంటెంట్ సినిమాలతో పాటుగా పాత సినిమాలను కూడా చూడాలనుకొనేవారికి ఓటీటీ సంస్థలు గుడ్ న్యూస్ ను చెప్తున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ సంస్థలకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇక్కడ అన్ని రకాల సినిమాలు విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఓటీటీల్లోకి వచ్చి ప్రేక్షకులకు ఆకట్టుకున్న బెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ఒరిజినల్ సిన్.. 

ఈ ఒరిజినల్ సిన్ మూవీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంటోనియో బాండెరాస్, ఏంజెలీనా జోలీ నటించిన అమెరికన్ ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. 2001 లో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కార్నెల్ వూల్‌రిచ్ రచించిన వాల్ట్జ్ ఇంటు డార్క్‌నెస్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది 1969 నాటి ఫ్రాంకోయిస్ ట్రూఫాట్ చిత్రం మిస్సిస్సిప్పి మెర్‌మైడ్‌కి రీమేక్. ఈ మూవీని నటి మిచెల్ ఫైఫర్ యొక్క నిర్మాణ సంస్థ వయా రోసా ప్రొడక్షన్స్ నిర్మించింది.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.


లవ్ హాస్టల్.. 

భారతదేశంలో జరిగే పరువు హత్యల నేపథ్యానికి వ్యతిరేకంగా ఈ మూవీ వచ్చింది. తమ కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడానికి పారిపోయిన జ్యోతి (సన్యా మల్హోత్రా), విక్రాంత్ (విక్రాంత్ మాస్సే) అనే యువ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒక హాస్టల్ లో ఉంటారు. వారిద్దరూ కుటుంబాన్ని ఎదురించి ఎలా జీవించారు అన్నది సినిమా స్టోరీ.. బాబీ డియోల్ విరాజ్ సింగ్ దాగర్ అనే పాత్రలో నటించాడు.. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది జీ5 లో స్ట్రీమింగ్ కు వచ్చి మంచి వ్యూస్ ను అందుకుంది.

సిల్వర్.. 

స్లివర్ అనేది షారన్ స్టోన్ , విలియం బాల్డ్విన్, టామ్ బెరెంజర్ వంటి స్టార్స్ నటించిన మూవీ.. 1993లో వచ్చిన అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం . ఇది ప్రైవేట్ యాజమాన్యంలోని న్యూయార్క్‌లోని ఎత్తైన స్లివర్ భవనంలో రహస్యమైన థ్రిల్లర్ మూవీగా వచ్చింది. ఇరా లెవిన్ నవల ఆధారంగా రూపొందించబడింది. జో ఎస్టెర్హాస్ స్క్రీన్ ప్లే నుండి ఫిలిప్ నోయ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ మూవీ అమెజాన్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

మేరీ క్రిస్మస్.. 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ న‌టి కత్రినా కైఫ్ క‌థ‌నాయిక‌గా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’. బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ సాలిడ్ హిట్ ను అందుకుంది. సినిమా మొత్తం క్రిస్మస్ పండుగ చుట్టూ తిరుగుతుంది. మ్యాచ్ బాంక్స్ పిక్చర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, టిప్స్ ఇండ‌స్ట్రీతో క‌లిసి ర‌మేశ్ తౌర‌ని ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, సంజయ్ కపూర్, దిను ఆనంద, విన‌య్ పాఠ‌క్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×