CM Revanth Reddy on Allu Arjun: పుష్పను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అదేనండీ పుష్ప-2 హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందిస్తూ ట్వీట్ చేశారు. డిసెంబర్ – 5వ తేదీన పుష్ప-2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పాటలు సూపర్ డూపర్ హిట్ కాగా, ప్రోమో కు కూడా భారీ వ్యూస్ వచ్చాయి. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-1 విడుదలై రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు హీరో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది.
కాగా పుష్ప-2 సినిమాపై ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కోసం హీరో అల్లుఅర్జున్, హీరోయిన్ రష్మికలు పలు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మజాకా అనే రీతిలో ఎక్కడ చూసినా ఫ్యాన్స్ సునామీ కనిపిస్తోంది. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు టాలీవుడ్ సహకరించాలన్నారు. అలాగే ఏ హీరో సినిమా విడుదల అవుతున్నప్పటికీ, ఆ హీరో డ్రగ్స్ మహమ్మారి గురించి యువతను చైతన్య పరిచేలా వీడియో విడుదల చేయాలన్నారు. దీనితో యువతపై హీరోల మాటలు ప్రభావితం చూపుతాయన్నది తెలంగాణ సర్కార్ అభిప్రాయం.
ఇలా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగానే ఇటీవల పుష్ప-2 సినిమా విడుదల సంధర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్రగ్స్ మహమ్మారిపై ఓ వీడియోను విడుదల చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. యువత మత్తు బారిన పడవద్దని, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని కోరారు. ఇలా అల్లు అర్జున్ వీడియో విడుదల చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ హీరో అల్లు అర్జున్, పుష్ప-2 టీమ్ కి అభినందనలు తెలిపారు.
Also Read: Karthika Masam 2024: ఈ అమావాస్య రోజు.. ఈ ఒక్క పూజ చేస్తే చాలు.. ఊహకు అందని ఫలితాలు..
మన పిల్లలను, తెలంగాణ యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించడానికి ప్రజా చైతన్య యాత్రలో అల్లు అర్జున్ పాల్గొనడం సంతోషంగా ఉందన్న ముఖ్యమంత్రి ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం మనమందరం చేతులు కలుపుదామని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేసి పుష్పను అభినందించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎంకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
మన పిల్లలు, తెలంగాణ యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించడానికి ప్రజా చైతన్య యాత్రలో అల్లు అర్జున్ పాల్గొనడం సంతోషంగా ఉందన్న ముఖ్యమంత్రి
ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం మనం అందరం చేతులు కలుపుదామని ఎక్స్… https://t.co/dZqbbpsQnA pic.twitter.com/Dfm4Ji5r0l
— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2024