E-Paper
Advertisement

OTT Movie: నటి ప్రైవేట్ వీడియోలు లీక్… అపరిచితుడి ఉచ్చులో నరకం… క్లైమాక్స్ వరకూ ఉత్కంఠే

OTT Movie: నటి ప్రైవేట్ వీడియోలు లీక్… అపరిచితుడి ఉచ్చులో నరకం… క్లైమాక్స్ వరకూ ఉత్కంఠే
Advertisement

OTT Movie : హాలీవుడ్ నటి ఒక్కసారి స్కాండల్‌లో పడితే, ఆమె ట్రస్ట్ చేసిన వాళ్లే ఆమెని చంపాలని ప్లాన్ చేస్తే ఏమవుతుంది? అలాంటి కంటెంట్ తో వచ్చిందే ఈ ‘ట్రస్ట్’ మూవీ. ఫుల్ టెన్షన్, సర్వైవల్ థ్రిల్ తో స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా కూడా రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బెస్ట్ సజెషన్. మొదటి నుంచి చివరిదాకా ఇంటన్స్ తో నడుస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ట్రస్ట్’ 2025లో వచ్చిన అమెరికన్ థ్రిల్లర్ మూవీ. కార్ల్సన్ యంగ్ మొదటి సారి డైరెక్టర్‌గా దీనిని రూపొందించారు. ఇందులో సోఫీ టర్నర్ (లారెన్ లేన్), రైస్ కాయిరో (జేమ్స్) లీడ్ రోల్స్ లో నటించారు. 2025 ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం జీ 5, హులు ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లారెన్ అమెరికాలో బాగా పాపులర్ నటి. అందరూ ఆమెని దేవతలా చూస్తారు. కానీ ఒక్క రోజులో ఆమె జీవితం తలకిందులు అవుతుంది. ఒక హ్యాకర్ ఆమె ఫోన్ హ్యాక్ చేసి ప్రైవేట్ ఫోటోలు, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఫోటో, పర్సనల్ చాట్స్ అన్నీ ఇంటర్నెట్‌లో పడేస్తాడు. రాత్రికి రాత్రి లారెన్ ఇమేజ్ బూడిద అవుతుంది. ట్విట్టర్, ఇన్‌స్టా అంతా “చీ… ఈమె ఇలాంటిదా?” అని ట్రోలింగ్. మీడియా రోజూ ఆమె ఇంటి ముందు క్యాంప్ కొడతుంది.ఇంట్లో కూడా భర్త జేమ్స్ తో గొడవ మొదలవుతుంది. అతను ఫేమస్ బిజినెస్‌మ్యాన్. ఈ సంఘటనతో లారెన్‌ని బ్లేమ్ చేస్తాడు. నీ వల్ల మా ఫ్యామిలీ ఇమేజ్ పోయింది, నా బిజినెస్ లాస్ కి కారణం నువ్వే అని నిందిస్తాడు. దీంతో లారెన్ డీలా పడిపోతుంది. ఎవరూ లేని ఒక పర్వత ప్రాంతంలో ఒక పెద్ద క్యాబిన్ బుక్ చేసుకుని, తన పెంపుడు డాగ్ జార్జీతో సహా ఒంటరిగా వెళ్లిపోతుంది.

Read Also : ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అక్కడ మొబైల్ సిగ్నల్ లేదు, ఇంటర్నెట్ లేదు, పొరుగు ఇళ్లు కూడా లేవు. ఫుల్ పీస్ కోసం ఆమె అక్కడికి వెళ్తుంది. ఒక రోజు మధ్యరాత్రి 2 గంటలు… బయట మంచు కురుస్తోంది. లారెన్ నిద్రలో ఉంటే డోర్‌కి గట్టిగా తన్నడం వినిపిస్తుంది. తలుపు తీస్తే ముగ్గురు వ్యక్తులు మాస్క్‌లు పెట్టుకుని, గన్స్, నైఫ్స్‌తో లోపలికి దూసుకొస్తారు. లారెన్ భయంతో ఒక రూమ్‌లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. వాళ్ళని పంపించింది ఆమె భర్తే అని తెలిసి షాక్ అవుతుంది. చివరికి ఆమె అక్కడినుంచి ప్రాణాలతో బయట పడుతుందా ? భర్త ఆమెను ఎందుకు చంపాలని అనుకున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే, ఈ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Advertisement

 

 

 

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×