E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిల బట్టలను దొంగలించి పాడు పని… వదినతో యవ్వారం… మామూలు ఆటగాడు కాదు

OTT Movie : అమ్మాయిల బట్టలను దొంగలించి పాడు పని… వదినతో యవ్వారం… మామూలు ఆటగాడు కాదు
Advertisement

OTT Movie : సోషల్ మెసేజ్ తో చాలా సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలకు అవార్డుల పంట పండుతుంటుంది. ఆశ్చర్యంగా శ్రీలంకలో రిలీజ్ అయిన ఒక అడల్ట్ మూవీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది మానసిక ఆరోగ్య అవగాహనపై చిత్రాల విభాగంలో పలు ఇంటర్ నేషనల్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా శ్రీలంకలో ‘అడల్ట్స్ ఓన్లీ’ సర్టిఫికేట్ పొంది, సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. ఈ కథ అమ్మాయిల లోదుస్తులను దొంగలించే ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. అతడు ఎందుకు అలా చేస్తున్నాడనేదే ఈ కథ. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో శ్రీలంకలో రిలీజ్ అయిన ఈ సినిమా పేరు ‘అండర్‌ప్యాంట్స్ థీఫ్’ (ఒరిజినల్ నేమ్ Jangi Hora) . సోమరత్నే దిస్సనాయకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పుబుదు చతురంగ (సామ్), దిల్హాని ఎకనాయకే (నయని) లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Plex లో ఉచితంగా అందుబాటులో ఉంది, Dailymotionలో కూడా లభిస్తుంది. అవార్డ్స్ విషయానికొస్తే శ్రీలంకలోని డెరానా ఫిల్మ్ అవార్డ్స్, సరసవి అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి (దిల్హాని), స్పెషల్ జ్యూరీ మెన్షన్ వంటి పలు అవార్డులు గెలుచుకుంది.

Advertisement

Read Also : ఏడేళ్లకే పెళ్లి ఎనిమిదేళ్లకు వితంతువు… బాయ్ ఫ్రెండ్ తో మరొక్కసారి… మస్ట్ వాచ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

సామ్ అనే యువకుడు ఒక అరుదైన మానసిక జబ్బుతో బాధపడుతుంటాడు. పొరుగింటి మహిళల అండర్‌వేర్ దొంగిలించడం, బయట అపరిచితులను తాకడం వంటి వ్యసనాలు అతనికి ఉంటాయి. ఈ ప్రవర్తన వల్ల కుటుంబం, సమాజం అతన్ని తీవ్రంగా ద్వేషిస్తుంది. ఇంట్లో వాళ్ళు అతను చేసే పనులు చూసి తరచూ కొట్టి, అవమానించి ఇంట్లో బంధిస్తారు. అయినా కూడా అతనిలో మార్పు రాదు. అయితే అతని అన్నయ్య భార్య నయని మాత్రమే అతని పరిస్థితిని ఒక రోగంగా అర్థం చేసుకుని, సానుభూతితో చికిత్స చేయించేందుకు పోరాడుతుంది.

Advertisement

ఈ పోరాటంలో సమాజంలోని అజ్ఞానం, మానసిక రోగులను పిచ్చోళ్లుగా ముద్ర వేయడం వంటి వాస్తవాలు బయటపడతాయి. ఇక మరిది కోసం వదిన ఎవరూ చేయని సాహసం చేస్తుంది. దీంతో స్టోరీ లు తిరుగుతుంది. చివరికి సామ్ జీవితం నయని వల్ల మార్పు చెందుతుందా? లేదా సమాజం అతన్ని ఎప్పటికీ ఆదరించదా? అతను అమ్మాయిల లోదుస్తులను మళ్ళీ దొంగలిస్తాడా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా ఎక్కడా సంచలనం కోసం సెన్సేషనలైజ్ చేయకుండా, చాలా మెచ్యూర్డ్‌గా, హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.

 

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×