E-Paper
Advertisement

OTT Movie : ఏడేళ్లకే పెళ్లి ఎనిమిదేళ్లకు వితంతువు… బాయ్ ఫ్రెండ్ తో మరొక్కసారి… మస్ట్ వాచ్ థ్రిల్లర్

OTT Movie : ఏడేళ్లకే పెళ్లి ఎనిమిదేళ్లకు వితంతువు… బాయ్ ఫ్రెండ్ తో మరొక్కసారి… మస్ట్ వాచ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు తెరకెక్కుతుంటే, వివాదాలు కూడా తలకెక్కుతుంటాయి. దర్శకురాలు దీప మెహతా అలాంటి వివాదాల్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఆమె తీసిన ‘ఫైర్’ మూవీని ఇండియాలో బ్యాన్ కూడా చేశారు. ఈ సినిమా తరువాత వచ్చిన మరో సినిమా అయితే మరిన్ని వివాదాలు తెచ్చింది. ఈ సినిమా ఇండియాలో షూటింగ్ మొదలెట్టగానే హిందూ వాదాన్ని ప్రొటెస్ట్ చేసే గ్రూప్స్ సినిమా సెట్స్ ని బూడిద చేశారు. దాంతో ఈ సినిమాని శ్రీలంకలో రీషూట్ చేయాల్సి వచ్చింది. బాల్య వితంతువుల చుట్టూ తిరిగే ఈ సినిమా సాంఘీక దురాచారాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలలోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

దీప మెహతా దర్శకత్వం వహించిన ఈ ఇండో-కెనడియన్ మూవీ పేరు ‘వాటర్’. 2005లో విడుదలైన ఈ సినిమా, ఆమె తెరకెక్కించిన ఫైర్, ఎర్త్ తర్వాత మూడో సినిమాగా వచ్చింది. ఇది ఆస్కార్ నామినేషన్ (బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్), గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ లో ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇందులో లిసా రే (కల్యాణి) జాన్ ఆబ్రహం (నారాయణ్), సీమా బిస్వాస్ (శకుంతల), చుయియా (సరళ) లీడ్ రోల్స్ లో నటించారు. ప్రైమ్ వీడియో, ముబీ ఓటీటీలలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1938 కాలం నాటి వారణాసిలో హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భార్య వితంతువై, ఆశ్రమంలో జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలి. జుట్టు కత్తిరించి, తెల్ల గుడ్డలు మాత్రమే వేసుకోవాలి. అంతేకాకుండా సమాజం నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి ఒక వితంతువుల ఆశ్రమంలో సరళ అనే 7 ఏళ్ల బాలికకి పెళ్లి అంటే ఏమిటో తెలియకుండానే పెళ్లి జరిగిపోతుంది. తోరణాలు ఎండిపోకముందే భర్త కూడా చనిపోయాడు. ఆమె జుట్టుని కత్తిరించి, తెల్ల గుడ్డలు వేసి ఆశ్రమంలో పడేస్తారు. అక్కడ కల్యాణి అనే యువతి సరళని చూసుకుంటుంది. కల్యాణి 8 ఏళ్లకే వితంతువైంది. ఆమెని ఆశ్రమ ఇన్‌చార్జ్ మాధుమతి డబ్బు కోసం ప్రాస్టిట్యూట్‌లా యూజ్ చేస్తుంది. గంగానది ఒడ్డున రిచ్ బ్రాహ్మణుల వద్దకి పంపిస్తుంది.

Read Also : 15 ఏళ్లకే ప్రెగ్నెన్సీ… అమ్మానాన్న ఆటలో స్కూల్ పిల్లలు… చిన్నపిల్లలు చూడకూడని సినిమా

Advertisement

ఇప్పుడు సరళ ఆశ్రమంలో ఆడుకుంటూ సమయం గడుపుతుంటుంది. ఒక రోజు గాంధీ ఆదర్శాలు పాటించే నారాయణ్ అనే యువకుడు కల్యాణిని చూసి ప్రేమలో పడతాడు. నారాయణ్ బ్రాహ్మణుడే కానీ వితంతువులు పునర్వివాహం చేసుకోవచ్చని నమ్ముతాడు. కల్యాణి కూడా నారాయణ్‌ని లైక్ చేస్తుంది. ఇద్దరూ సీక్రెట్‌గా మాట్లాడుకుంటారు, ప్రేమలో పడతారు. కానీ కల్యాణి సీక్రెట్ ని మాధుమతి తెలుసుకుంటుంది. ఆమెని బ్లాక్‌మెయిల్ చేసి మళ్లీ ప్రాస్టిట్యూషన్‌ చేయిస్తుంది. నారాయణ్ కల్యాణిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇక్కడి నుంచి వీళ్ళ ముగ్గురి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. ఆ మలుపులు ఏమిటి ? కల్యాణినితో నారాయణ్ పెళ్లి జరుగుతుందా ? సరళ జీవితం ఎలా ఉంటుంది ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×