E-Paper
Advertisement

Up Coming movies : తమిళ కామెడీ ‘లక్కీ ది సూపర్ స్టార్’ నుంచి మలయాళ చిత్రం ‘చాతా పచా’ వరకు… ఫిబ్రవరి 3వ వారం రిలీజ్ కానున్న సినిమాలు

Up Coming movies : తమిళ కామెడీ ‘లక్కీ ది సూపర్ స్టార్’ నుంచి మలయాళ చిత్రం ‘చాతా పచా’ వరకు… ఫిబ్రవరి 3వ వారం రిలీజ్ కానున్న సినిమాలు
Advertisement

Up Coming movies : ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ ని సరికొత్త సినిమాలు, సిరీస్ లు పలకరించనున్నాయి. తమిళం, మలయాళం, కన్నడ భాషలలో యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి కామెడీ డ్రామా వరకు డిజిటల్‌గా విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాల పేర్లు, ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాల్లోకి వెళ్తే…

లక్కీ ది సూపర్ స్టార్ (Lucky the Superstar)

ఈ ఫీల్ గుడ్ కథ తప్పిపోయిన కుక్కపిల్ల చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక చిన్న అమ్మాయితో సహా కలిసిన ప్రతి ఒక్కరికి మంచి చేస్తుంది. అయితే కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి కుట్రలో చిక్కుకుంటుంది. ఈ చిన్న కుక్కపిల్లని రక్షించడం కోసం హీరో (జివి ప్రకాష్ కుమార్) ప్రయత్నిస్తాడు. అనస్వర రాజన్ కూడా నటించిన ఈ కామెడీ-డ్రామాలో హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఇది 2026 ఫిబ్రవరి 20 నుంచి JioHotstarలో అందుబాటులో ఉండనుంది.

చత్తా పచా (Chatha Pacha)

Advertisement

ఈ మలయాళ చిత్రం కొచ్చిలో కొంతమంది స్నేహితులు ఏర్పాటు చేసిన WWE-రెజ్లింగ్ ఫైట్ క్లబ్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌకత్ స్నేహితులుగా నటించగా, విశాక్ నాయర్ విలన్ పాత్రలో చాకోగా నటించారు. అధ్వైత్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా అతిధి పాత్రలో నటించారు. ఇది 2026 ఫిబ్రవరి 19న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అమోస్ అలెగ్జాండర్ (Amos Alexander) 

జాన్, మేరీ అనే ఒక జర్నలిస్ట్ జంట రియల్ క్రైమ్ షోను నడుపుతారు. అందులో భాగంగా అమోజ్ అలెగ్జాండర్‌ అనే ఒక నెరస్తున్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ ముందుకు సాగుతున్న కొద్దీ, మరిన్ని నిజాలు బయటపడతాయి. ఇవి జర్నలిస్ట్ జంటపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఈ మలయాళ థ్రిల్లర్ మూవీలో నటుడు అజు వర్గీస్, జాఫర్ ఇడుక్కి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2026 ఫిబ్రవరి 20న Sun NXT లో స్ట్రీమింగ్ కానుంది.

రాక్షస (Raakshasa) 

Advertisement

ఈ కన్నడ సిరీస్ ఒక నది ఒడ్డున జరిగిన హత్యల దర్యాప్తు చేసే పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. గ్రామస్తులు మొసళ్ళే దీనికి కారణమని ఆరోపించినప్పటికీ, SI హన్మప్ప దానిని నమ్మకుండా దర్యాప్తు మొదలు పెడతాడు. ఈ సిరీస్ 7 ఎపిసోడ్‌ల వరకు నడుస్తుంది. ఈ కన్నడ సిరీస్‌కు సుహాన్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించగా, అప్పన్న, జహంగీర్, మయూరి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇది 2026 ఫిబ్రవరి 20న ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

నీలి హక్కీ (Neeli Hakki)

ఈ కన్నడ సినిమా 2021లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. ఫెస్టివల్ రన్ సమయంలో చాలా ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. గణేష్ హెగ్డే ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో మాత్రమే విడుదల అవుతోంది. ఈ కథ 10 ఏళ్ల గ్రామీణ బాలుడు సిద్ధ చుట్టూ తిరుగుతుంది. అతని తల్లిదండ్రులు నగరానికి వలస వెళ్లాక, ఆ పిల్లవాడు కొత్త ప్రపంచానికి ఎలా అలవాటు పడతాడో సినిమాలో చూపిస్తారు. ఇది 2026 ఫిబ్రవరి 20న Sun NXT ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Read Also : క్రైమ్ నుంచి సైన్స్ ఫిక్షన్‌ సినిమాల వరకు… నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ వెబ్ సిరీస్‌ల లిస్ట్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×