E-Paper
Advertisement

Netflix Top Web Series : క్రైమ్ నుంచి సైన్స్ ఫిక్షన్‌ సినిమాల వరకు… నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ వెబ్ సిరీస్‌ల లిస్ట్

Netflix Top Web Series : క్రైమ్ నుంచి సైన్స్ ఫిక్షన్‌ సినిమాల వరకు… నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ వెబ్ సిరీస్‌ల లిస్ట్
Advertisement

Netflix Top Web Series : ఇప్పుడు సినిమాలు, సిరీస్ లకు ఓటీటీ ఒక వేదికగా ఉన్న విషయం తెలిసిందే. అయితే Netflixలో వచ్చే కంటెంట్ కి భారీగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇందులో మిస్టరీ, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్, ఐకానిక్ హీస్ట్‌ సిరీస్ లు అలరిస్తూనే ఉన్నాయి. మీ మూడ్ ని బట్టి ఎలాంటి కంటెంట్ కావాలన్నా చూసేయచ్చు. ఇక వీకెండ్ లో నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిన టాప్ వెబ్ సిరీస్‌లపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. 3 Body Problem (సైన్స్ ఫిక్షన్)

1960లలో చైనాలో ఒక శాస్త్రవేత్త తీసుకున్న నిర్ణయం వల్ల భూమిపైకి గ్రహాంతరవాసుల (Aliens) ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో ఉన్న ఐదుగురు మేధావులైన శాస్త్రవేత్తలు కలిసి మానవాళిని కాపాడేందుకు చేసే పోరాటమే ఈ సిరీస్. ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చైనీస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే వచ్చిన మొదటి సీజన్ హిట్ అవ్వడంతో, దీని రెండో సీజన్ 2026లో రాబోతోంది.

2. Wednesday (సూపర్ నేచురల్ మిస్టరీ) 

Advertisement

ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌లలో ఒకటి. జెన్నా ఒర్టెగా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒక వింత మనస్తత్వం కలిగిన వెడ్నెస్డే ఆడమ్స్ అనే అమ్మాయి, తనలాంటి ప్రత్యేక శక్తులున్న వాళ్ళు చదివే ‘నెవర్‌మోర్ అకాడమీ’లో చేరుతుంది. అక్కడ జరుగుతున్న వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఆమె తన సైకిక్ శక్తులతో ఎలా ఛేదించిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

3. The Witcher (ఫాంటసీ యాక్షన్)

ఈ స్టోరీ గెరాల్ట్ ఆఫ్ రివియా అనే ఒక ‘మాన్స్టర్ హంటర్’ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక యువ యువరాణి, ఒక శక్తివంతమైన మంత్రగత్తెతో ఈ స్టోరీ ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఇందులో యాక్షన్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి. ఇందులో మొదటి మూడు సీజన్లలో హెన్రీ కావిల్ ప్రధాన పాత్ర పోషించగా, సీజన్ 4 నుండి లియామ్ హేమ్స్‌వర్త్ కనిపించనున్నారు.

4. Stranger Things (హారర్ Sci-Fi)

Advertisement

1980ల కాలంలో హాకిన్స్ అనే ఒక చిన్న పట్టణంలో ఒక అబ్బాయి అదృశ్యమవడంతో కథ మొదలవుతుంది. అతని కోసం వెతుకుతున్న క్రమంలో అతని స్నేహితులకు ‘ఎలెవెన్’ అనే అతీంద్రియ శక్తులున్న అమ్మాయి పరిచయమవుతుంది. వాళ్ళు కలిసి ‘అప్ సైడ్ డౌన్’ అనే మరో ప్రమాదకరమైన ప్రపంచం నుండి వచ్చే రాక్షసులతో పోరాడుతారు. ఇది ఒక ఎమోషనల్ అడ్వెంచర్ సిరీస్.

5. The Signal (జర్మన్ మిస్టరీ థ్రిల్లర్)

ఇది తక్కువ ఎపిసోడ్లు ఉన్న ఒక మినీ-సిరీస్. ఒక్క రోజులోనే చూసేయవచ్చు. అంతరిక్ష మిషన్‌లో ఉన్న పౌలా అనే వ్యోమగామి మిస్సింగ్ తో స్టోరీ మొదలవుతుంది. ఆమె భర్త స్వెన్ తన భార్య ఎక్కడికి పోయిందో కనిపెట్టే క్రమంలో భూమికే ముప్పుగా మారే ఒక భయంకరమైన రహస్యం తెలుస్తుంది.

Read Also : వాలెంటైన్స్ డే స్పెషల్… గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూడాల్సిన బెస్ట్ తెలుగు రొమాంటిక్ సిరీసులు

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×