E-Paper
Advertisement

OTT Movie : భర్తను చంపడానికి ఇద్దరమ్మాయిల ప్లాన్.. అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ టర్న్స్ ఉన్న కొరియన్ క్రైమ్ డ్రామా

OTT Movie : భర్తను చంపడానికి ఇద్దరమ్మాయిల ప్లాన్.. అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ టర్న్స్ ఉన్న కొరియన్ క్రైమ్ డ్రామా
Advertisement

OTT Movie : మహిళలపై జరిగే అబ్యూస్ మీద డీప్ మెసేజ్ ఇచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని స్టోరీలు రివెంజ్ థీమ్స్‌తో మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్లు గా పేరు తెచ్చుకుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక కొరియన్ సిరీస్ టెన్షన్ పీక్స్‌కి తీసుకెళ్తోంది. ఈ సిరీస్ కథ ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. భర్త డొమెస్టిక్ అబ్యూస్ తో నరకం చూపిస్తుండటంతో, భార్య మర్డర్ ప్లాన్ కి స్కెచ్ వేస్తుంది. దీనికి తన ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ స్టోరీ. ఈ సిరీస్ K-డ్రామా థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఓటీటీలో మంచి వ్యూస్ తో నడుస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘అస్ యూ స్టూడ్ బై’ (Use you stood by) ఒక కొరియన్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సిరీస్. జపాన్ రైటర్ హిదెయో ఒకుదా 2014 నవల ‘నాయోమి అండ్ కానాకో’ ఆధారంగా తీసిన ఈ సిరీస్‌ను లీ జెంగ్-రిమ్ డైరెక్ట్ చేశారు. ఇందులో జెఓన్ సో-నీ (ఎఉన్-సూ), లీ యూ-మి (హ్యూయ్-సూ), జాంగ్ సెంగ్-జో (జిన్-ప్యో/జాంగ్ కాంగ్ డ్యూయల్ రోల్), లీ మూ-సెంగ్ (కిమ్ జిన్-ప్యో) మెయిన్ రోల్స్ లో నటించారు. 8 ఎపిసోడ్లతో ఈ సీరీస్ 2025 నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక లగ్జరీ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో జో యూన్-సు సేల్స్ గర్ల్‌గా పని చేస్తుంటుంది. ఆమె లైఫ్ ముందుకు సాగుతోంది కానీ గతంలో ఆమె ఎదుర్కొన్న వేధింపులు ఆమెను మానసికంగా కుంగదీస్తాయి. ఒక రోజు ఆమె చైల్డ్‌ హుడ్ బెస్ట్ ఫ్రెండ్ హ్యూయ్-సూతో రీకనెక్ట్ అవుతుంది. హ్యూయ్-సూ పర్ఫెక్ట్ మ్యారేజ్ లో ఉన్నట్లు కనిపించినా, ఆమె హస్బెండ్ జిన్-ప్యో ఒక భయంకరమైన అబ్యూజర్ అని, ఆమె తీవ్రమైన గృహ హింసకు గురవుతూ ఉందని తెలుస్తుంది. ఇక ఈ సమాజం గృహ హింస బాధితులకు న్యాయం చేయలేదని బాగా బాధపడతారు.

Read Also : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

Advertisement

ఇప్పుడు వీళ్ళు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటారు. ఈ ఇద్దరు మహిళలు జిన్-ప్యోను హత్య చేయాలని కుట్ర పన్నుతారు. అదే తమకు ఉన్న ఏకైక మార్గమని వాళ్ళు నమ్ముతారు. అయితే వీళ్ళు తమ ప్లాన్ అమలు చేసే సమయంలో జిన్ అనే ఒక వ్యక్తి గమనిస్తాడు. అతను ఒక పవర్‌ఫుల్ మ్యాన్. వాళ్ల సీక్రెట్ తెలిసి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. కానీ డేంజర్ పెరుగుతుంది. ఈ క్లైమాక్స్ కూడా షాకింగ్ గా ఉంటుంది. చివరికి వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేక ట్రాప్ అవుతారా? అనే విషయాలను ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×