BigTV English

OTT Movie : పంతులు ముందే పాడు పనులు చేసే కసాయి రౌడీ… స్టూడెంట్ పై కన్నుపడి వీడు చేసే పని తెలిస్తే …

OTT Movie : పంతులు ముందే పాడు పనులు చేసే కసాయి రౌడీ… స్టూడెంట్ పై కన్నుపడి వీడు చేసే పని తెలిస్తే …

OTT Movie : బాలీవుడ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలను థియేటర్లోకి వెళ్లి చూడకపోయినా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో మాత్రం మిస్ అవకుండా చూస్తున్నారు. స్టూడెంట్ ని కాపాడుకొనే క్రమంలో, టీచర్ ఒక మర్డర్ చేయాల్సి వస్తుంది. ఈ డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఒక బాలీవుడ్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వాద్’ (Vadh). 2022లో విడుదలైన ఈ  బాలీవుడ్ థ్రిల్లర్ మూవీకి జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వాల్ రచించి,  దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్యూషన్ చెప్పుకునే పంతులు చుట్టూ తిరుగుతుంది. అతని స్టూడెంట్ పై ఒక రౌడీ కన్ను పడడంతో, ఆ రౌడీని మర్డర్ చేస్తాడు పంతులు. వాద్ అనే ఈ మూవీ 9 డిసెంబర్ 2022న థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మిశ్రా, మంజు అనే వృద్ధ దంపతులు ట్యూషన్ చెప్పుకుంటూ జీవిస్తుంటారు. మిశ్రా కొడుకు దివాకర్ అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉంటాడు. కొడుకుని అమెరికాకి పంపించడానికి, మిశ్ర చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటాడు. తన ఇంటిని కూడా డబ్బుకోసం తాకట్టు పెడతాడు. అమెరికాకు వెళ్లాక దివాకర్ డబ్బులు పంపడం మానేస్తాడు. ఇంటి మీద అప్పు చేసినందుకు, అప్పు ఇచ్చిన పాండి అనే వ్యక్తి, మిశ్రాని చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అమ్మాయిలను మిశ్రా ఇంటికి తెచ్చుకుంటూ, ఆ పని చేసుకుంటూ ఉంటాడు పాండి. మిశ్రా అతనిని ఏమి చేయలేక బాధపడుతుంటాడు. కొడుకుని డబ్బులు అడిగితే, ఏదో ఒక సాకు చెప్పి తపించుకుంటాడు. అయితే మిశ్రాని పాండి వేధిస్తుండటంతో, ఒక పోలీస్ ఆఫీసర్ పాండికి వార్నింగ్ ఇస్తాడు. పాండి బాగా పలుకుబడి ఉండటంతో పోలీసులను పెద్దగా పట్టించుకోడు.

ఒకరోజు ట్యూషన్ చెప్తున్న మిశ్రా దగ్గరికి వెళ్లి, స్టూడెంట్ తో గడిపే అవకాశం ఇస్తే డబ్బులు మాఫీ చేస్తాను అని చెప్తాడు. ఆ వెంటనే మిశ్రా పాండీని స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపేస్తాడు. శవాన్ని ఎవరికీ కనిపించకుండా కాల్చి బూడిద చేస్తాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండిపోతాడు మిశ్రా. పోలీసులకు పాండి కనపడుటలేదని అతని భార్య కంప్లైంట్ చేస్తుంది. మిశ్రా ఇంటికి చివరగా వెళ్ళినట్లు తెలుసుకుంటారు పోలీసులు. చివరికి ఈ హత్య కేసును పోలీసులు చేధిస్తారా ? కొడుకు తల్లిదండ్రుల అప్పును తీరుస్తాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వాద్’ (Vadh) అనే ఈ  మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×