BigTV English

Delhi Election Results 2025: ఢిల్లీ దంగల్‌లో విజేత ఎవరు? కౌంటింగ్ ప్రారంభం

Delhi Election Results 2025: ఢిల్లీ దంగల్‌లో విజేత ఎవరు? కౌంటింగ్ ప్రారంభం

Delhi Election Results 2025: గల్లీల్లో కాదు.. ఢిల్లీలో కింగ్ ఎవరో తేలబోయే సమయం వచ్చేసింది. దేశ రాజధాని ఎవరి అడ్డానో డిసైడ్ చేసే టైమ్ రానే వచ్చింది. హస్తిన ఎవరి హస్తగతం కాబోతోంది? ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. మిగిలింది ఓట్ల లెక్కింపే. ఆ కౌంటింగ్ మరికాసేపట్లో జరగబోతోంది. ఆప్ ముచ్చటగా మూడోసారి గెలుస్తుందా? 27 ఏళ్ల బీజేపీ అధికార దాహం తీరుతుందా? కాంగ్రెస్ సత్తా చాటుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.


ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఉదయం 11 గంటల వరకు గెలుపు ఎవరిదన్నది ఓ క్లారిటీ రానుంది. అయితే గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

అధికారాన్ని మరోసారి నిలుపుకొనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి హామీల డోస్ ను ఎవరూ ఊహించనంతగా పెంచింది. ఢిల్లీలో 26 ఏళ్లుగా పవర్ లెస్ గా ఉన్న కమలం పార్టీ ప్రచారం చివరి రోజు ఏకంగా 22 రోడ్ షోలు నిర్వహించింది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టినా ఢిల్లీ అసెంబ్లీలో ఎందుకు పట్టు సాధించలేకపోతున్నామన్న ఆలోచన బీజేపీలో కనిపించింది. అందుకే ఈసారి ఢిల్లీ పీఠం ఎక్కాల్సిందేనన్న కసి కాషాయదళంలో పెరిగింది. కేజ్రీవాల్ టార్గెట్ గా ప్రధాని మోడీ దగ్గర్నుంచి కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల దాకా ప్రచారాన్ని హోరెత్తించారు. షీష్ మహల్ అంటే కేజ్రీవాల్ కట్టుకున్న అద్దాల మేడ సంగతి తేలుస్తామన్నారు.


అటు 2013కు ముందు ఏకంగా పదిహేనేళ్ల పాటు హస్తినలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్‌ మరోసారి పగ్గాల కోసం గట్టిగానే పోరాడింది. అయితే 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇప్పుడు మాత్రం గేర్ మార్చి స్పీడ్ పెంచింది. సో మూడు పార్టీల మధ్య ముక్కోణపు పోరాటం ముగిసి ప్రజా తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. దేశరాజధానిలో ఎవరి జెండా ఎగురుతుందన్న ఉత్కంఠ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై 2015, 2020లో వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు కరెక్ట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని మేజర్ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పినా స్వీప్ చేస్తుందని ఊహించలేకపోయాయి. ఆప్ కు 45 సీట్లు వస్తాయని, బీజేపీకి 24, కాంగ్రెస్ కు ఒక సీటు వస్తుందని అంచనాలు వెలువరించాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఆప్ కు 53 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సీన్ కట్ చేస్తే 2015లో ఆప్ ఏకంగా 67 సీట్లు గెలిచి బంపర్ విక్టరీ కొట్టింది. బీజేపీ 3 గెలవగా, కాంగ్రెస్ సున్నాకు పరిమితం అయింది.

Also Read: అవును.. ఆ ఎన్నికల్లో అవకతవకలు, 39 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరారు?

ఇక 2020 ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. 2020 పోల్స్ కు సంబంధించి 8 సర్వే సంస్థలు అంచనాలు వెలువరించగా, ఆప్ కు 54, బీజేపీ 15 వరకు వస్తాయని లెక్కేశారు. సీన్ కట్ చేస్తే ఆప్ 62 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 8 సీట్లకు పరిమితం అయింది. కాంగ్రెస్ కు మళ్లీ ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆప్ 59 నుంచి 68 సీట్ల మధ్య గెలుస్తుందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మాత్రమే అంచనాలకు చాలా దగ్గరగా వచ్చింది.

మనదేశంలో కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కచ్చితమైన అంచనాలను వెలువరించగా.. మరికొన్ని సందర్భాల్లో కంప్లీట్ బోల్తా కొట్టేశాయి. ప్రజలు ఒకలా తీర్పు ఇస్తే ఇక్కడ అంచనాలు మరోలా వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. లోక్ సభ ఫలితాలకు సంబంధించి అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీ కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని లెక్కేస్తే, 293 దగ్గరే ఆగిపోయింది. దాంతో చాలా సర్వే సంస్థలు క్షమాపణలు చెప్పి తమ సర్వే పద్ధతులపై ఇన్ స్పెక్షన్ చేసుకుంటామన్నాయి. అటు హర్యానా అసెంబ్లీ ఫలితాల విషయంలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. చాలా సంస్థలు కాంగ్రెస్ వస్తుందని అంచనాలు రిలీజ్ చేయగా.. మళ్లీ బీజేపీనే గెలిచింది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×