YS Sharmila on YS Jagan: మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, షర్మిళతో భేటీ అయినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ భేటీపై ఇప్పటివరకు సాయి రెడ్డి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అందరూ వదంతులుగానే భావించారు. అవ్వదంతులకు తాజాగా షర్మిళ ఫుల్ స్టాప్ పెట్టారు. సాయి రెడ్డితో భేటీ జరిగిన మాట వాస్తవమేనని, అన్ని విషయాలను చర్చించడం జరిగిందంటూ షర్మిళ అన్నారు.
ఇదే విషయంపై స్పందించిన షర్మిళ కంచలన కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ తన చేతులు తానే కాల్చుకున్నారని, ఇప్పుడు బీద ఏడుపులు ఏడుస్తూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేని వైయస్ జగన్, ఇప్పుడు కార్యకర్తలను బ్రతిమలాడుకుంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నారన్నారు. జగన్ క్యారెక్టర్ లేదంటూ, ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ జీరో కు పడిపోయిందని షర్మిళ విమర్శించారు.
సాయి రెడ్డితో జరిగిన భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చాయని, జగన్ వద్ద తాను పడ్డ ఇబ్బందులను తనతో చెప్పుకున్నారన్నారు. ఆస్తుల వ్యవహారంలో జగన్ ఇచ్చిన సూచన మేరకే, తాను స్పందించినట్లు సాయి రెడ్డి ఒప్పుకున్నారని జగన్ ఇంతలా దిగజారి పోవాలా అంటూ ప్రశ్నించారు. సాయి రెడ్డి రాజీనామా పై జగన్ ఇటీవల స్పందిస్తూ.. రాజకీయాలలో క్యారెక్టర్ అవసరం అంటూ చేసిన కామెంట్స్ పై షర్మిళ సీరియస్ కామెంట్ చేశారు.
క్యారెక్టర్ లేని జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారని, క్యారెక్టర్ అనే పదం అర్థం కూడా జగన్ కు తెలియదన్నారు. వైయస్సార్ కుటుంబం పరువు తీయవద్దని సాయిరెడ్డి వేడుకున్నా, అబద్ధాలు చెప్పించిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుందన్నారు. సొంత తల్లి మీద స్వార్థం కోసం కేసు పెట్టడం, సొంత చెల్లికి వెన్నుపోటు పొడచడం ఇవే నా క్యారెక్టర్ అంటూ ఆమె ప్రశ్నించారు. సొంత చిన్నానను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నప్పుడే.. జగన్ విశ్వసనీయత పోయిందని వైయస్ షర్మిళ అన్నారు.
Also Read: RGV investigation : తొమ్మిది గంటలు సాగిన ఆర్జీవీ విచారణ – వెంటనే మరో షాక్ ఇచ్చిన పోలీసులు
షర్మిళ చేసిన ఈ కామెంట్స్.. జగన్ కు భారీ షాకిచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జగన్ అడుగులు వేస్తున్న క్రమంలో, షర్మిళ చేసిన కామెంట్స్ జగన్ కు ఎదురుదెబ్బ అంటూ ప్రచారం సాగుతోంది. మొత్తం మీద సాయి రెడ్డి రాజీనామా చేయడం, ఆ తర్వాత షర్మిళ తో భేటీ కావడం చూస్తుంటే.. మున్ముందు సాయి రెడ్డి నోట ఎటువంటి ఆరోపణలు వినిపిస్తాయోనని ప్రచారం ఊపందుకుంది. మరి షర్మిళ చేసిన కామెంట్స్ కి జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.