E-Paper
Advertisement

OTT Movie : దొంగ చేతిలో ఫస్ట్ నైట్ వీడియో… పరేషాన్ అయ్యే భార్య భర్తలు … కిక్ ఎక్కించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : దొంగ చేతిలో ఫస్ట్ నైట్ వీడియో… పరేషాన్ అయ్యే భార్య భర్తలు … కిక్ ఎక్కించే కామెడీ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : బాలీవుడ్ సినిమాలను మన ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. నెంబర్ వన్ ఇండస్ట్రీ గా ఉన్న బాలీవుడ్ కి సౌత్ ఇండస్ట్రీ గట్టి పోటీనే ఇస్తుంది. ఏది ఎలా ఉన్నా అన్ని సినిమాలను మన ప్రేక్షకులు చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే బాలీవుడ్ నుంచి ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. కొత్తగా పెళ్లయిన జంట తమ ఫస్ట్ నైట్ ను వీడియో తీసి సిడి లో భద్రపరుస్తారు. కానీ ఆ సిడి ఒక దొంగ చేతికి చిక్కుతుంది. ఆ సిడి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….

జి ఫైవ్ (Zee 5) లో

Advertisement

ఈ బాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’  (Vicky vidhya ka woh Wala video). 2024లో విడుదలైన ఈ బాలీవుడ్ కామెడీ  మూవీలో రాజ్‌కుమార్ రావ్, ట్రిప్తి డిమ్రీలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో తమ తప్పిపోయిన ఫస్ట్ నైట్ వీడియొ టేప్ కోసం కొత్తగా పెళ్ళయిన జంట వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో మూవీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం మొదలు పెడతారు. హీరో ఫంక్షన్స్ కి మెహందీ వేస్తుంటాడు. హీరోయిన్ ఒక డాక్టర్ కోర్స్ చదువుతూ ఉంటుంది. హీరోయిన్ కి ఒకసారి పెళ్లి కుదురుతుంది. దానిని హీరో చెడగొట్టి, హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. అయితే వీళ్ళు ఫస్ట్ నైట్ ని వీడియో తీసుకుంటారు. అయితే అది ఒక సిడి రూపంలో భద్రంగా దాచుకుంటారు. ఒకరోజు వీళ్లు ఉండే ఇంటికి దొంగలు పడతారు. ఆ దొంగ కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లిపోతాడు. అందులో వీళ్లు తీసుకున్న వీడియో కూడా ఉంటుంది. హీరోకి అది తెలిసి కంగారు పడతాడు. హీరో తండ్రి పోలీసులకు విషయం చెప్తాడు. అయితే చిన్న వస్తువులే కదా అని పోలీసులు లైట్ తీసుకుంటారు. హీరో అక్క అందంగా ఉండటంతో, ఆమెను  బుట్టలో వేసుకోవాలని ఇన్స్పెక్టర్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.

ఈ క్రమంలోనే ఆ దొంగను కనిపెట్టే పనిలో ఉంటాడు ఇన్స్పెక్టర్. సిడి పోయిందనే విషయం భార్యకు తెలిసి హీరో పై చాలా కోప్పడుతుంది. అయితే ఆ వీడియో దొంగ నుంచి ఒక రౌడీ లేడీ దగ్గరికి వెళుతుంది. ఆమె వీళ్ళ గురించి తెలుసుకొని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంది. చివరికి హీరో ఆ వీడియోని తిరిగి తెచ్చుకుంటాడా? ఆ వీడియో వైరల్ అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’  (Vicky vidhya ka woh Wala video) అనే ఈ మూవీని చూడండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×