Pawan kalyan: వైసీపీని కదలికలను జనసేన అధినేత పవన్ కల్యాణ గమనిస్తున్నారా? వైసీపీ ట్రాప్‌లో పడొద్దని నేతలకు ఎందుకు సూచనలు చేశారు? వైసీపీ స్కెచ్‌ని ముందుగా అర్థం చేసుకున్నారా? ఎమ్మల్యేల వాయిస్ ప్రతీది ప్రజల వాయిస్‌గా ఉండాలని ఎందుకున్నారు? వీటిపై ఆ పార్టీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
వైసీపీ స్కెచ్ ఏంటి?
రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా టర్న్ అవుతాయో చెప్పలేము. సరిహద్దుల్లో సైనికుడి మాదిరిగా ఎప్పటికప్పుడు వ్యూహాలను నేతలు మార్చుకోవాలి. లేకుంటే రాజకీయాలకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. వీటిని ముందుగానే గమనించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కూటమి సర్కార్‌ని విడగొట్టేందుకు తొమ్మిది నెలలుగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఏ ఒక్కటీ ఫలించలేదు. చివరకు బూమరాంగ్ అవుతూ వస్తున్నాయి.
తొలుత సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. వాటిని తనదైన శైలిలో తిప్పికొట్టారు ముఖ్యనేతలు. దీంతో ఏం చెయ్యాలో తెలియక మరో స్కెచ్ వేసింది వైసీసీ. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ ఆదేశించారు. ఉన్నట్లుండి జగన్ యూ టర్న్ వెనుక ఏదో స్కెచ్ దాగి ఉందన్నది కూటమి నేతల మాట.
దీనివెనుక రెండు స్కెచ్‌లు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మొదలైంది. ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీ ప్రజల తరపున తమ వాయిస్ వినిపించలేకపోతున్నామని నేతలు చెప్పుకోవడం మొదలైంది. ఈ విషయం అధిష్టానం చెవిలో పడింది. వెంటనే అలర్టయిన జగన్, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొవాలని సూచన చేశారు.
ALSO READ: గ్రూప్ -2 అభ్యర్థులను మోసం చేశారు
పవన్ సూచనల వెనుక
ఇంకోవైపుకు వస్తే కూటమి ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టాలని వైసీపీ మరో స్కెచ్ వేసినట్టు అంతర్గతంగా టాక్ నడుస్తోంది. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. మనకు అసలైన పరీక్ష ఇప్పటి నుంచే మొదలవుతుందని అన్నారట అధినేత పవన్. ఈ విషయంలో నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారట. ఏదో విధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను రెచ్చగొట్టి విడగొట్టాలనే ప్రయత్నాలు వైసీపీ చేస్తోందని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారట.
వైసీపీ సభ్యులు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా జాగ్రత్త ఉండాలని నేతలకు సలహాలు ఇచ్చారు పవన్ కల్యాణ్. పార్టీ సభ్యులు ఏ మాత్రం సహనం కోల్పోకుండా హుందాగా వ్యవహరించాలని చెప్పుకొచ్చారు. వైసీపీ ట్రాప్‌లో పడితే ప్రజల ముందు తలెత్తుకోలే మన్నారు. మన ప్రతీ మాట ప్రజల వాయిస్‌గా ఉండాలని పార్టీ నేతలకు తెలిపారు. ప్రజలు అందర్నీ జాగ్రత్త గమనిస్తున్నారని గుర్తు చేశారు.
తమ తమ నియోజకవర్గంలో ప్రతీ సమస్యను సభ దృష్టికి తీసుకురావాలని నేతలకు సూచన చేశారు పవన్ కల్యాణ్. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమాయాన్ని వినియోగించుకోవాలన్నారు. దీనివల్ల మన వాయిస్ ప్రజల గొంతుక అవుతుందన్నారు. కొన్ని విషయాలపై చర్చ సందర్భంలో మాట్లాడాలని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఓవరాల్‌గా పవన్ కల్యాణ్.. తమ పార్టీ నేతలకు చెప్పిన అంశాలను పరిశీలిస్తే.. వెనుక ఏదో కుట్ర జరుగుతున్న సంకేతాలు బలపడుతున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విందు ఇచ్చారాయన. వారితో కులాశగా మాట్లాడారు. ఏమైనా నియోజకవర్గం సమస్యలుంటే ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకురావాలని చెప్పారట పవన్. మొత్తానికి వైసీపీ నేతలు అసెంబ్లీకి రావడంతో అందరికంటే ముందుగా జనసేన అలర్టయిందనే చెప్పవచ్చు.