BigTV English

Pushpa2 : ‘పుష్ప 2’ పిల్లలను చెడగొట్టింది.. సెన్సార్ బోర్డు పై హెడ్ మాస్టర్ ఫైర్..

Pushpa2 : ‘పుష్ప 2’ పిల్లలను చెడగొట్టింది.. సెన్సార్ బోర్డు పై హెడ్ మాస్టర్ ఫైర్..

Pushpa2 : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2.. భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజ్ అయిన ఈ మూవీ భారీ సక్సెస్ ను అయితే అందుకుంది. కానీ విమర్శలు లు కూడా మూట కట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా సక్సెస్ టాక్ ను అందుకున్నా కూడా అల్లు అర్జున్ పై సుకుమార్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ ను అందుకున్నప్పటికి అల్లు అర్జున్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పోలీసులు, కేసులు, బెయిల్ పై రిలీజ్.. ఇవన్నీ కూడా వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే పుష్ప 2 రిలీజ్ అయ్యి రెండు నెలలు పూర్తి అయిన కూడా విమర్శలు తగ్గలేదు. తాజాగా మరో షాక్ తగిలింది. సినిమా పై ఓ స్కూల్ హెడ్ మాస్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఓ సందర్బంలో మాట్లాడుతూ సెన్సార్ బోర్డు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయమేంటో తెలుసుకుందాం..


పుష్ప 2 మూవీకి బిగ్ షాక్..

అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు కలెక్షన్లను కూడా అందుకుంది. అయితే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటన జరగడానికి కారణం అల్లు అర్జున్ అంటూ వాదన వినిపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు అవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన అల్లు అర్జున్ కి కోర్టు షాక్ ఇచ్చింది. ఇదంతా జరగడంతో పుష్ప 2 భారీ సక్సెస్ ని అందుకున్న కూడా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయలేదు. ఒకవైపు వివాదాలు తరుముతున్నా సినిమా పై ఎఫెక్ట్ పడకుండా కలెక్షన్ల వర్షం కురిసింది. దాదాపు 1900 కోట్లు రాబట్టింది.


Also Read : జబర్దస్త్ వర్ష పరువు తీసిని హీరో.. అమ్మాయే కాదంటూ…

పుష్ప 2 ఎఫెక్ట్ : సెన్సార్ బోర్డు పై టీచర్ అసహనం.. 

పుష్ప 2 మొత్తం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉంటుంది. భారీ యాక్షన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ నటించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బన్నీ ఈ మూవీలో కనిపించాడు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కూడా మూవీ పై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఇలాంటి సినిమాలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయంటూ ఇప్పటికే పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్ యూసఫ్ గూడా లోని స్కూల్ హెడ్మాస్టర్ అసహనం వ్యక్తం చేశారు. మా స్కూల్లో పిల్లలు సగం మంది పుష్పాలాగా మారిపోయారు.. మాట తీరుతో పాటు, నడవడిక కూడా అలానే ఉంది. ఎంత చెప్పినా కూడా పిల్లలు మా మాట వినట్లేదు అదే ట్రెండు అదే ఫ్యాషన్ అంటూ మాకే ఎదురు సమాధానం చెప్పేస్తున్నారు. ఈ సినిమాను చూసి పిల్లలు బాగా చెడిపోయారు. సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికెట్ ఇస్తుందో అర్థం కావట్లేదు అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు బై మండిపడ్డారు. సినిమాలు తీయడం గొప్ప కాదు ఆ సినిమాలని ప్రజల్లోకి ఎంతగా తీసుకెళ్లాలో అది ఆలోచిస్తూ సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు చురకలు అంటించింది.. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సెన్సార్ బోర్డు సభ్యులు స్పందిస్తారేమో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×