BigTV English
Advertisement

Suspense Thriller OTT : సస్పెన్స్ ట్విస్ట్ లతో విజయ్ ఆంటోని థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్?

Suspense Thriller OTT : సస్పెన్స్ ట్విస్ట్ లతో విజయ్ ఆంటోని థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్?

Suspense Thriller OTT : ఓటీటీలో సస్పెన్స్ మూవీలకు కొదవ లేదు.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమాల కన్నా సస్పెన్స్ థ్రిల్లర్, బోల్డ్ మూవీ ల పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రతి వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొన్నటి వరకు కల్కి లాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. కానీ ఇప్పుడు థ్రిల్లర్, సస్పెన్స్ మూవీలే ఓటీటీలకు బాగా లాభాలు తెచ్చి పెడుతున్నాయి. ఇక తాజాగా మరో సస్పెన్స్ మూవీ ఓటీటిలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ..


తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని సస్పెన్స్ సినిమాలకు కేరాఫ్ అయ్యాడు.. ఆయన బిచ్చగాడు వంటి సినిమాలతో పాటుగా భయంకరమైన సస్పెన్స్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈయన నటించిన మరో సూపర్ హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన హిట్లర్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ మూవీ పోస్టర్ ను అభిమానులతో అమెజాన్ పంచుకుంది. ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రెడీ గా ఉందని తెలుస్తుంది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీకి జోడీగా రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. గౌతమ్ వాసుదేవమీనన్‌, చరణ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ధన దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్టర్ మణిరత్నంకు ప్రియ శిష్యుడు..

ఈ మూవీ తమిళ్ళో సెప్టెంబర్ 27 న రిలీజ్ అయ్యింది. కానీ దేవర ఎఫెక్ట్ కారణంగా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తెలుగు వెర్షన్‌కు సంబంధించి ప్రమోషన్స్ భారీగానే చేశారు. టీజర్‌, ట్రైలర్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావడంతో హిట్లర్‌కు థియేటర్లు దొరక్కపోవడంతో విజయ్ ఆంటోనీ మూవీ వాయిదా పడింది. అయితే తమిళ నాట భారీ డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చెయ్యలేదు. ఇప్పుడు ఏకంగా ఓటీటీ లోకి వచ్చేస్తుంది.. మినిస్టర్ మైఖేల్ మనుషులు ఒక్కొక్కరి గా హత్యకు గురవుతుంటారు. మినిస్టర్‌కు చెందిన కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఓ అపరిచిత వ్యక్థి తెలివిగా ఎత్తుకుపోతాడు. ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసారు అన్నది సినిమా స్టోరీ.. ఈ ఏడాది హిట్లర్ మూవీలో మూడో ఫ్లాప్ విజయ్ ఆంటోనీ ఖాతాలో చేరింది.. ఇక ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈ సినిమా హీరోయిన్ రియా సుమన్ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. నాని మజ్ను మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత పేపర్‌బాయ్, మెన్ టూ, టాప్ గేర్‌, కిస్మత్ సినిమాలు చేసింది.. ఆ సినిమాలు అన్ని మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.


Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×