E-Paper
Advertisement

Vritta out on OTT : డేంజర్లో పడేసే అన్ ఎక్స్పక్టెడ్ కాల్… పీడకలలాంటి జర్నీ… సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు అదిరే ట్రీట్

Vritta out on OTT : డేంజర్లో పడేసే అన్ ఎక్స్పక్టెడ్ కాల్… పీడకలలాంటి జర్నీ… సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు అదిరే ట్రీట్
Advertisement

Vritta out on OTT : ఓటీటీలో చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే వచ్చేస్తాయి. మరికొన్ని మాత్రం నెలల తరబడి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి. అలా బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన 5 నెలల తరువాత ఓటీటీలోకి అడుగు పట్టిన కన్నడ మిస్టరీ థ్రిల్లరే ఈరోజు మన మూవీ సజెషన్. స్టోరీ మొత్తం డేంజరస్ రోడ్ లో తిరిగే జర్నీ, ఆ జర్నీ చేస్తున్న డ్రైవర్ చుట్టూనే తిరుగుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? దాని కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో అందుబాటులో

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కన్నడ మిస్టరీ థ్రిల్లర్ ‘వృత్త’ (Vritta). ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఐదు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయ్యింది. డిసెంబర్ 26 నుంచి ZEE5లో ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ తో పాటు మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు లాంగ్వేజెస్‌లో కూడా అందుబాటులో ఉంది. లికిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాహిర్ మొహియుద్దీన్, హరిణి సుందరరాజన్, చైత్ర జె. అచార్ ప్రధాన పాత్రలు పోషించారు. సపోర్టింగ్‌ రోల్స్ లో శ్రీనివాస్ ప్రభు, మాస్టర్ అనురాగ్, శశికళ తదితరులు నటించారు. మిస్టరీ థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లకి ఈ మూవీ మంచి ఛాయిస్ మావా. థియేటర్స్‌లో పెద్దగా అటెన్షన్ రాలేదు కానీ ఓటీటీలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది.

Advertisement

Read Also :  పెళ్లయినా పట్టించుకోని భర్త… మాంసం మత్తులో ముంచే ప్రియుడు… గూస్ బంప్స్ తెప్పించే కథ

స్టోరీలోకి వెళ్తే…

సిద్ధార్థ్ (మాహిర్ మొహియుద్దీన్) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది కథ. అతను రిజర్వ్డ్ స్వభావం ఉన్న మనిషి. ఒక రాత్రి ట్రిప్‌ కి వెళతాడు. కానీ వెళ్తూ వెళ్తూ తీసుకున్న రాంగ్ డెసిషన్ అతని లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. అనూహ్యమైన ఫోన్ కాల్, తప్పు టర్న్ తీసుకోవడం అనే సింపుల్ మిస్టేక్స్ అతన్ని భయంకరమైన జర్నీలోకి నెడతాయి. సిద్ధార్థ్ ఒక అన్‌బ్రేకబుల్ సైకిల్‌లో ఇరుక్కుపోతాడు. అక్కడ నుంచి సేఫ్ గా బతికి బయట పడడానికి పోరాడాల్సి వస్తుంది. అతని ప్రెగ్నెంట్ వైఫ్, ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్, పాత ట్రామాలు అన్నీ ఒక్కొక్కటిగా రివీల్ అవుతాయి. సినిమాలో మిస్టరీ, సస్పెన్స్, సైకలాజికల్ టెన్షన్ హైలైట్ గా ఉంటాయి. మరి సిద్ధార్థ్ ఆ డేంజరస్ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడతాడు? ఆ సైకిల్ బ్రేక్ అవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీని చూడాల్సిందే. మూవీ స్టార్టింగ్ స్లోగా సాగి, సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు షాక్ ఇస్తాయి. గ్రిప్పింగ్ స్టోరీతో చివరి వరకూ కట్టిపడేసే ట్విస్టులతో ఈ మూవీ మంచి సీట్ ఎడ్జ్ ఫీల్ ఇస్తుంది.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×