E-Paper
Advertisement

Romantic Horror Thriller OTT : పెళ్లయినా పట్టించుకోని భర్త… మాంసం మత్తులో ముంచే ప్రియుడు… గూస్ బంప్స్ తెప్పించే కథ

Romantic Horror Thriller OTT : పెళ్లయినా పట్టించుకోని భర్త… మాంసం మత్తులో ముంచే ప్రియుడు… గూస్ బంప్స్ తెప్పించే కథ
Advertisement

Romantic Horror Thriller OTT : మనుషుల మాంసాన్ని తినే నరమాంస భక్షకుల గురించి ఇప్పటిదాకా ఎన్నోసార్లు వినే ఉంటాము మనము. అలాగే పలు సినిమాల్లో చూశాము కూడా. కానీ ఏకంగా ఇలాంటి తిండి తింటూ ప్రేమించుకునే ప్రేమ జంటను ఎప్పుడైనా చూశారా? ఒకవేళ చూడకపోతే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఈ మూవీ, అది స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ డీటైల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

అస్సామీ సినిమా ప్రేమికుల కోసం తెరకెక్కిన యూనిక్ జెమ్ లాంటి సినిమా ‘ఆమిస్’ (aamis). భాస్కర్ హజారికా డైరెక్ట్ చేసిన ఈ 2019 రొమాంటిక్ హారర్ ఫిల్మ్ లో ఫుడ్ ఆబ్సెషన్ తో తెరకెక్కింది. ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, అనేక అవార్డ్స్, నామినేషన్స్ సంపాదించిన ఈ మూవీ ఇప్పుడు Sony LIVలో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ ప్లస్ సైకలాజికల్ డ్రామా ఇష్టపడేవాళ్లకి మస్ట్ వాచ్ మూవీ. లీమా డాస్ (నిర్మలి), అర్ఘదీప్ బరువా (సుమన్) ఇందులో లీడ్ కాస్ట్ గా నటించారు. సపోర్టింగ్‌ రోల్స్ లో నీతాలి డాస్, సాగర్ సౌరభ్, మనాష్ కె డాస్ వంటి వాళ్లు నటించారు. డెబ్యూట్ యాక్టర్స్ అయినా పెర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉంటుంది. లీమా డాస్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ గెలుచుకుంది. IMDbలో దీనికి 7.7 రేటింగ్ ఉంది. కానీ డార్క్, డిస్టర్బింగ్ కంటెంట్ ఉంది కాబట్టి వెజిటేరియన్స్ లేదా సెన్సిటివ్ గా ఉండే ఆడియన్స్ కేర్‌ఫుల్‌గా చూడండి. హారర్, రొమాంటిక్ డ్రామా ఇష్టపడేవాళ్లకి వీకెండ్‌కి బెస్ట్ ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. కానీ డిన్నర్ తర్వాత చూడకపోవడమే బెటర్.

Advertisement

Read Also : ఏడాది తరువాత ఓటీటీలోకి చైనీస్ క్రైమ్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టోరీలోకి వెళ్తే…

స్టోరీ గువహాటిలో సాగుతుంది. మ్యారిడ్ పీడియాట్రిషియన్ నిర్మలి (లీమా డాస్) లేట్ 30sలో ఉంటుంది. అప్పటికే పెళ్ళైనప్పటికే ఆమె హస్బెండ్ బిజీ డాక్టర్ కావడంతో లోన్లీ లైఫ్ గడుపుతుంది. ఆమెకు మీట్ అంటే పిచ్చి. ఈ క్రమంలోనే ఒకరోజు యంగ్ PhD స్టూడెంట్ సుమన్ (అర్ఘదీప్ బరువా)ను కలుస్తుంది. అతను నార్త్-ఈస్ట్ మీట్ ఈటింగ్ హ్యాబిట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ మీట్ షేర్ చేసుకుంటూ ఫ్రెండ్‌షిప్ పెంచుకుంటారు. సుమన్ నిర్మలికి అరుదైన, అన్‌యూజువల్ మీట్ డిషెస్ పంపిస్తాడు. రివర్ ఫిష్, బ్యాట్ మీట్ లాంటివి. వాటిని తింటూ మైమరిచి పోయిన ఆ డాక్టర్ కు అతని మీద రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి. కానీ సొసైటీకి బ్ భయపడి, ఒకరికి ఒకరు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఆ డిజైర్ వాళ్లను ఒక హారిఫైయింగ్ క్రైమ్ వైపు నెడుతుంది. మీట్ ఆబ్సెషన్ కాస్తా ఒక డార్క్ ట్విస్ట్ తీసుకుంటుంది. సినిమా మొదట స్లో, సబ్టిల్‌గా సాగి… మంచి ఫీల్ ఇస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో డార్క్ హారర్‌గా మారి షాక్ ఇస్తుంది. ఇంతకీ డాక్టర్ ఆ యువకుడితో కలిసి చేసిన పని ఏంటో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×