E-Paper
Advertisement

Vrott upcoming releases 2026 : ‘ది గ్రే మెన్ 2’ నుంచి ‘బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ’ వరకు… ఓటీటీలో కొత్త సినిమాల జాతర

Vrott upcoming releases 2026 : ‘ది గ్రే మెన్ 2’ నుంచి ‘బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ’ వరకు… ఓటీటీలో కొత్త సినిమాల జాతర
Advertisement

Vrott upcoming releases 2026 : అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లాంటి టాప్ ఓటీటీలన్నీ ఇప్పటికే 2026లో తమ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి రానున్న అప్ కమింగ్ సిరీస్ ల లిస్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు Vrott అనే మరో ఓటీటీ 2026 అప్ కమింగ్ సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ని అప్‌డేట్ చేసింది. మరి ఆ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

The Wild Blade of Strangers

చైనీస్ యాక్షన్ డ్రామా ‘ది వైల్డ్ బ్లేడ్ ఆఫ్ స్ట్రేంజర్స్’ భారతదేశంలో అక్టోబర్ 3న వ్రోట్ అనే ఓటీటీలో రిలీజ్ కానుంది. ఎలైట్ ఆర్మ్డ్ ఫోర్స్ మాజీ సైనికుడు టియాన్ అన్యే కథ ఇది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న ఆయన లైఫ్ చివరి రాజ వారసుడును రక్షించినప్పుడు ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ శిశువును రక్షించడానికి అతను మరోసారి యోధుడిగా మారతాడు.

13 Days 13 Nights

Advertisement

రోష్డీ జెమ్, లైనా ఖౌద్రీ నటించిన ఫ్రెంచ్ వార్ డ్రామా ఇది. గత సంవత్సరం ఫ్రాన్స్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ జూన్ 16న వ్రోట్ ద్వారా భారతదేశంలో అందుబాటులోకి వస్తోంది. తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సిద్ధమవుతున్న వేళ… ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోవడానికి రెడీ అయ్యే US ఆర్మీ దళాల కథే ఈ మూవీ. ఈ యుద్ధ వాతావరణంలో రాయబార కార్యాలయంలో 500 మంది ఫ్రెంచ్ ప్రజలు చిక్కుకుంటారు. వాళ్ళను రక్షించి, జాగ్రత్తగా విమానాశ్రయానికి పంపడానికి యూఎస్ కమాండర్ మొహమ్మద్ బిడా చేసే ప్రయత్నాన్ని ఇందులో చూడొచ్చు.

No Tears in Hell

ల్యూక్ బెయిన్స్, గ్వెన్ వాన్ డామ్ తెరకెక్కించిన ఇంగ్లీష్ హర్రర్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రంలో అలాస్కాలోని అత్యంత చల్లని ప్రదేశంలో నివసించే అలెక్స్, అతని తల్లి కథను మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. పట్టణంలోని నిరాశ్రయుల శిబిరాల్లో తిరుగుతూ, పేదలకు హెల్ప్ చేస్తాడు అలెక్స్. వాళ్ళని ఆహారం, ఆశ్రయం కల్పిస్తానని ప్రామిస్ చేస్తాడు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్లాక అతని తల్లి షాకింగ్ పని చేస్తుంది. శారీరకంగా హింసించడం, చంపి తినడం వంటివి చేస్తుంది. ఈ మూవీ మే 15 నుంచి అందుబాటులోకి రానుంది.

The Grey Men 2

Advertisement

2024లో వచ్చిన చైనీస్ చిత్రం ‘ది గ్రే మెన్’ సీక్వెల్ ‘ది గ్రే మెన్ 2’. ట్రైయాడ్ బాస్ సాంగ్ బ్యాంగ్ మేయర్ స్థానాన్ని ఆక్రమించి, తన నేరస్థుడి ఇమేజ్‌ను మార్చుకుని, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ సాంగ్ కు నిధుల కొరత ఏర్పడుతుంది. దీంతో తన రాజకీయ ఎదుగుదలకు అవసరమైన డబ్బును పొందడానికి మరిన్ని నేరాలు చేస్తాడు. మార్చి 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

The Comeback

ఈ లిస్ట్ లో ఉన్న మరో చైనీస్ సినిమా ‘ది కమ్‌బ్యాక్’. ఒక యాంటిక్ షాప్ వ్యాపారి దుకాణం గోడల లోపల మృతదేహాలు, తుపాకులు దొరుకుతాయి. ఒక అతన్ని ఒక రహస్య సంస్థ టార్గెట్ చేస్తుంది. జూలై 21 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉంటుంది.

Our Girls

డచ్ డ్రామా ‘అవర్ గర్ల్స్’. ఇద్దరు దంపతులు, వాళ్ళ ఇద్దరు టీనేజ్ కుమార్తెలతో కలిసి ఆల్పైన్ విహారయాత్రకు వెళతారు. ఈ క్రమంలో వాళ్ళు అక్కడ అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటారు. ఈ ఇంట్రస్టింగ్ మూవీలో థెక్లా రూటెన్, ఫెడ్జా వాన్ హుయెట్, నూర్ట్జే హెర్లార్, వాలెంటిజ్న్ ధేనెన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

Blade of Fury

ఆష్టన్ చెన్, మైఖేల్ టోంగ్ ల చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ’. సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాలో డబ్బు కోసం ఎవరినైనా చంపే క్రూరమైన బౌంటీ హంటర్ కథను చూడవచ్చు.

Read Also : 4 ఏళ్ల పాపను పొట్టన పెట్టుకునే సైకో పిల్లలు… ఈ స్కూల్ టీచర్ ఇచ్చే పనిష్మెంట్ కు గుండె జారిపోద్ది

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×