E-Paper
Advertisement

Best Mystery Thriller : చర్చిలో మర్డర్… గుడ్ ఫ్రైడే రోజు బ్యాడ్ న్యూస్… నెవర్ బిఫోర్ క్లైమాక్స్ ట్విస్ట్

Best Mystery Thriller : చర్చిలో మర్డర్… గుడ్ ఫ్రైడే రోజు బ్యాడ్ న్యూస్… నెవర్ బిఫోర్ క్లైమాక్స్ ట్విస్ట్

Best Mystery Thriller :ఇప్పడు మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలను ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. రక రకాల మర్డర్ కేసులతో ఆడియన్స్ ని తికమక పెట్టేలా స్టోరీలు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన అత్యంత డేంజరస్ కేస్‌గా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా నిలుస్తుంది. ఇందులో లాక్ చేసిన రూమ్ లో ఒక మర్డర్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. థ్రిల్లర్ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ మిస్టరీ క్రైమ్ ఫిల్మ్ పేరు ‘వేక్ అప్ డెడ్ మ్యాన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ’. రియాన్ జాన్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ. డేనియల్ క్రెయిగ్ మాస్టర్ డిటెక్టివ్ బెనోయిట్ బ్లాంక్‌గా మూడోసారి నటించిన ఈ చిత్రం, 2025 డిసెంబర్ 12 నుంచి Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Read Also : ఓటీటీలోకి బెంగాలీ డిటెక్టివ్ థ్రిల్లర్… డాక్టర్ హత్య కేసుతో ఉత్కంఠ రేపే స్టోరీ… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

స్టోరీ ఏమిటంటే

గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక చిన్న టౌన్ లో చర్చిలో ప్రార్థనలు జరుగుతుంటాయి. విక్స్ అనే చర్చ్ ఫాదర్ పక్కనే ఉన్న చిన్న రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడే అతను డెడ్ అవుతాడు. వెనుక నుంచి ఎవరో నైఫ్ తో పొడిచి చంపారు. రక్తం కారుతూ ఉంటుంది. రూమ్ లాక్ అయి ఉంది, ఎవరూ ఎంటర్ కాలేదు. చర్చిలో ఉన్న వాళ్ళంతా సాక్షులు. ఇది పూర్తిగా అసాధ్యమైన లాక్డ్-రూమ్ మర్డర్! యంగ్ ప్రీస్ట్ ఫాదర్ జడ్ ఇది ఎలా జరిగిందని షాక్ అవుతాడు. ఈ కేస్ సాల్వ్ చేయడానికి ప్రపంచ ప్రసిద్ధ డిటెక్టివ్ బెనోయిట్ బ్లాంక్ (డేనియల్ క్రెయిగ్) వస్తాడు. చర్చి సభ్యులు మార్తా, డాక్టర్ నాట్ , సామ్సన్ వంటి వాళ్లు సస్పెక్ట్స్ గా ఉంటారు.

నిజానికి ఇక్కడ మార్తా మెయిన్ మాస్టర్‌మైండ్. చర్చిలో దాచబడిన మిలియన్ల విలువైన రేర్ డైమండ్ జ్యూవెల్ “ఈవ్స్ ఆపిల్”ను దొంగతనం చేసి దాచింది. విక్స్ కి విషయం తెలుస్తుందనే భయంతో, మార్తా-సామ్సన్-డాక్టర్ నాట్ కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేస్తారు. విక్స్ ఫ్లాస్క్‌లో పాయిజన్ వేసి చంపేస్తారు. తర్వాత ఫేక్ నైఫ్ తో ఒక డెవిల్ చంపినట్లు సీన్ సెట్ చేస్తారు. ఆతరువాత వజ్రాల నక్లెస్ తో పారిపోయి పంచుకోవాలని ప్లాన్. చివరికి డిటెక్టివ్ నెరస్థులను పట్టుకుంటాడా ? ఈ కేసును ఎలా ముగిస్తాడు ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×