E-Paper
Advertisement

ఓటీటీలోనే టాప్ 10 మూవీస్ లో ఒకటి ఈ మిలటరీ థ్రిల్లర్… సీక్వెల్ అనౌన్స్మెంట్

ఓటీటీలోనే టాప్ 10 మూవీస్ లో ఒకటి ఈ మిలటరీ థ్రిల్లర్… సీక్వెల్ అనౌన్స్మెంట్
Advertisement

War Machine sequel : నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఒక బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌ తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూపేస్తోంది. అలన్ రిచర్డ్సన్ హీరోగా, పాట్రిక్ హ్యూస్ దర్శకత్వం వహించిన మిలటరీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ మెషిన్’ సీక్వెల్ డెవలప్‌మెంట్ దశలో ఉందని అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి నెట్‌ఫ్లిక్స్ ఆల్-టైమ్ టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచిన నేపథ్యంలో ఈ అప్‌డేట్ యాక్షన్ లవర్స్‌ను ఆనందపరిచింది. మరి ఈ నేపథ్యంలో ‘మెషీన్ వార్’ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథ ఏంటంటే ?

‘వార్ మెషిన్’ ఒక ధైర్యవంతుడైన సైనికుడి కథ. అతను ఒంటరిగా ఎదుర్కొనే ప్రమాదాలు, యాక్షన్ సీన్లు, ఇంటెన్స్ సస్పెన్స్ ఫుల్ కథాంశం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేస్తాయి. మన హీరో (అలెన్ రిచ్‌సన్) ఈ సినిమాలో అమెరికన్ ఆర్మీలో స్టాఫ్ సార్జెంట్‌ గా పని చేస్తాడు. అఫ్ఘానిస్తాన్‌ లో తాలిబన్లు జరిపిన ఒక ఘోరమైన దాడిలో తన తమ్ముడిని కోల్పోయిన హీరో బాధలో ఉంటాడు. నిజానికి ఆ దాడి నుండి హీరో మాత్రమే ప్రాణాలతో బయట పడతాడు. తన తమ్ముడిని కాపాడ లేకపోయాననే తీవ్రమైన బాధ, సెంటిమెంట్ అతనిని వెంటాడుతుంటాయి.

Advertisement

ఆర్మీ రేంజర్ కావడం అన్నది తన తమ్ముడి ఆఖరి కల. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి హీరో యుఎస్ ఆర్మీ రేంజర్ స్క్రోల్ (US Ranger Scroll) కోసం అత్యంత కఠినమైన మిలిటరీ ఎంపిక శిక్షణలో అవకాశం పొందుతాడు. ఎనిమిది వారాల నరకప్రాయమైన శిక్షణ తర్వాత, వందల మందిలో కేవలం కొద్దిమంది (ఎలైట్ టీమ్) మాత్రమే ఆఖరి రౌండ్‌ కు అర్హత సాధిస్తారు. చివరి పరీక్షగా ఒక దట్టమైన అటవీ పర్వత ప్రాంతంలో ‘డెత్ మార్చ్’ అనే ఛాలెంజ్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆఖరి పరీక్షలో ఊహించని మలుపు ఉంటుంది. సైనికుల బృందం అడవిలో ముందుకు సాగుతున్న సమయంలో వారు ఊహించని ఒక భయంకరమైన శత్రువును ఎదుర్కొంటారు. ఆకాశం నుండి వచ్చిన ఒక గ్రహాంతర నౌక భూమిపై మారణహోమం సృష్టించే ఒక భారీ కిల్లింగ్ మెషీన్ లా మారి దాడి చేస్తుంది. ఎలాంటి సమాచారం, ఆధునిక ఆయుధాలు లేని ఆ అడవిలో, ఆ నాశనమే లేని గ్రహాంతర రోబోట్ నుండి ప్రాణాలతో బయట పడటం ఆ సైనికులకు ఒక పెద్ద సర్వైవల్ గేమ్‌ అవుతుంది. మనుషులు కన్పిస్తేనే వేటాడి చంపే ఆ ఏలియన్ కిల్లర్ రోబోట్‌ ను ఎదుర్కోవడానికి హీరో ఏం చేశాడు ? చివరికి దాన్ని చంపారా ? లేదా వీళ్ళే దానికి బలయ్యారా ? అన్నది స్టోరీ.

ఎక్కడ చూడవచ్చు ?

అలన్ రిచర్డ్సన్ తన ఫిట్‌నెస్, యాక్షన్ స్టైల్‌తో హీరోగా బాగా నటించాడు. ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు డబ్బింగ్‌ లో కూడా అందుబాటులో ఉంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్ కలిపి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ హిట్ లిస్టులో స్థానం సంపాదించింది.

సీక్వెల్ ఎలా ఉండబోతోంది ?

Advertisement

నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు సీక్వెల్ డెవలప్‌మెంట్ దశలో ఉందని వెల్లడించారు. ఫస్ట్ పార్ట్ లోని కథను రెండవ భాగంలోనూ మరింత ఇంటెన్స్ గా, భారీ యాక్షన్ సీన్లతో కొనసాగించనున్నారు. అలన్ రిచర్డ్సన్ తిరిగి హీరోగా నటించే అవకాశం ఎక్కువగా ఉంది. సీక్వెల్‌లో కొత్త ట్విస్టులు, మరింత ఇంటెన్స్ యాక్షన్, గ్లోబల్ స్కేల్ ఉండనున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ ఆల్-టైమ్ టాప్ 10లో నిలవడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఎందుకు చూడాలి ?

యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అలన్ రిచర్డ్సన్ యాక్షన్ స్టైల్ చూస్తే ఫ్యాన్స్‌కు జాన్ విక్ గుర్తు వస్తుంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉండటం వల్ల దక్షిణాది ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంజాయ్ చేయవచ్చు. ఈ మూవీని ఇంకా చూడకపోతే ముందు చూసి సీక్వెల్‌కు సిద్ధమవ్వండి.

Tags

Related News

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×