E-Paper
Advertisement

ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ సిరీస్ ‘గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2’

ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ సిరీస్ ‘గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2’
Advertisement

Gram Chikitsalay Season 2 : ప్రైమ్ వీడియో హిట్ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ‘సప్నే వర్సెస్ ఎవ్రీవన్’, ‘ఆస్పిరెంట్స్’ తర్వాత ఇప్పుడు గ్రామీణ ఆరోగ్యం చుట్టూ తిరిగే ‘గ్రామ్ చికిత్సాలయ్’ సీజన్ 2తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 2025లో విడుదలై భారీ విజయం సాధించిన ఈ సిరీస్ రెండవ సీజన్ జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

సీజన్ 2 ఎందుకు స్పెషల్?

మొదటి సీజన్ గ్రామీణ ఆసుపత్రుల దుస్థితి, ఆరోగ్య అవగాహన లోపం, ప్రజల సమస్యలను హాస్యం ద్వారా అందంగా చూపించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. IMDbలో 7.1 రేటింగ్ సాధించిన ఈ సిరీస్ రెండవ సీజన్ కథ గత సీజన్ ముగిసిన చోటి నుంచే కొనసాగుతుంది. భత్‌కండి అనే కల్పిత గ్రామంలో డాక్టర్ ప్రభాత్ (అమోల్ పరాశర్) గ్రామస్తులను ఆసుపత్రికి రప్పించడానికి కొత్త ఉపాయాలు ప్రయత్నిస్తాడు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కఠోర వాస్తవాలు, సూత్రాలు vs నిజ జీవితం మధ్య సంఘర్షణ, హాస్యం, ఎమోషన్ అన్నీ ఈ సీజన్‌లో బలంగా ఉంటాయి.

ఎవరెవరు ఏ పాత్రలో ?

Advertisement

డాక్టర్ ప్రభాత్ గా అమోల్ పరాశర్ నటించారు. ఇంకా ఫస్ట్ పార్ట్ లో నటించిన ఆకాష్ మఖిజా, ఆనందేశ్వర్ ద్వివేది, వినయ్ పాఠక్, ఆకాంక్ష రంజన్ కపూర్, గరిమా విక్రాంత్ సింగ్ సీజన్ 2లోనూ కనిపించబోతున్నారు. దినేష్ లాల్ యాదవ్ (నిరాహువా) సెకండ్ పార్ట్ లో కొత్తగా జాయిన్ అయ్యారు. లలితం తివారీ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా, వైభవ్ సుమన్, శ్రేయా శ్రీవాస్తవ కథ రాశారు. ‘ది వైరల్ ఫీవర్’ నిర్మించిన ఈ సిరీస్ హిందీలో మాత్రమే వస్తుంది. 240 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.

సీజన్ 2 లో ఏం ఆశించవచ్చు?

గ్రామస్తుల నుంచి సందేహాలు ఎదురైనా డాక్టర్ ప్రభాత్ వారి నమ్మకం సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. గ్రామ ఆసుపత్రిని నడపడానికి కేవలం వైద్య విద్య మాత్రమే సరిపోదని, మరెన్నో అంశాలు కావాలని అతను గ్రహిస్తాడు. హాస్యం, భావోద్వేగాలు, సామాజిక సందేశాలు అన్నీ బ్యాలెన్స్‌ గా ఉంటాయి. మొదటి సీజన్‌ కు లభించిన ఆడియన్స్ లవ్ చూస్తే రెండవ సీజన్ మరింత బాగుంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రైమ్ వీడియో కామెంట్స్

Advertisement

ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ మనీష్ మేఘాని మాట్లాడుతూ “ప్రేక్షకులు ఇప్పుడు గ్రామీణ కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ‘గ్రామ్ చికిత్సాలయ’ ఆ ధోరణికి సరైన ఉదాహరణ. మొదటి సీజన్‌ కు లభించిన అపారమైన ప్రేమ తర్వాత రెండవ సీజన్‌ ను అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు.గ్రామీణ జీవితం, ఆరోగ్య సమస్యలు, హాస్యం, ఎమోషన్ కలిపిన ఈ సిరీస్ జూన్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తోంది. కొత్త సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×