E-Paper
Advertisement

Telangana Rising 2047 Vision: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. మామూలుగా లేదుగా.. కళ్లు చెదిరిపోయేలా డెవలప్‌మెంట్‌

Telangana Rising 2047 Vision: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. మామూలుగా లేదుగా.. కళ్లు చెదిరిపోయేలా డెవలప్‌మెంట్‌

Telangana Rising 2047 Vision:  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ముగింపు కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో కీలక క్షణంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తూ.. తెలంగాణ భవిష్యత్‌పై రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర ప్రణాళికను ప్రజలకు పరిచయం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మట్టిలోని పోరాట చరిత్ర, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం రచించిన ఉద్యమాలను గుర్తుచేశారు. జల్–జంగిల్–జమీన్ కోసం కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన రైతాంగ చరిత్రకు ఈ నేల సాక్షి అని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందించిన ఈ దార్శనిక పత్రం నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాలతో, నిపుణుల సలహాలతో, ప్రపంచ ప్రామాణిక నమూనాల ఆధారంగా రూపొందించబడిందని సీఎం స్పష్టం చేశారు. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని సిద్ధం చేసిన పుస్తకం కాదని, ప్రజల ఆశయాలతో ముడిపడి ఉన్న ప్రణాళిక అని ఆయన వివరించారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ముందుకు 

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం.

భారత జాతీయ GDPలో కనీసం పదో వంతు వాటాను తెలంగాణ సాధించాలనే ధ్యేయంతో.. ప్రభుత్వం ఈ విజన్ రూపొందించింది.

ఈ ప్రణాళిక రూపకల్పనలో

తెలంగాణ రైజింగ్ 2047″ దార్శనిక పత్రం, రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.

రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా.. తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్​ 2047 డాక్యుమెంట్​

ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్​ మ్యాప్​.

తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిత కోసం..ప్రజల భవిష్యత్తు కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో “తెలంగాణ రైజింగ్ 2047” డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్​ తయారు చేసింది.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు.. ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించింది.

అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది.

ఈ డాక్యుమెంట్​ తయారీలో NITI Aayog కీలక భూమిక నిర్వహించింది. ISB (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు.

వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసింది.

వీటన్నింటినీ విశ్లేషించుకొని.. వడపోసి.. తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచింది.

ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం తెలంగాణ పురోగాభివృద్ధికి దోహదపడుతుంది.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యం.

దీంతో తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.

రాష్టం నలుమూలల అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు.. అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. 65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పన లో పాలుపంచుకున్నారు.

ఈ ఆర్ధిక వృద్ధికి మూడు మూల స్తంభాలు

ఆర్థిక వృద్ధి,
సమ్మిళిత అభివృద్ధి,
సుస్థిర అభివృద్ధి.

అదునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయి.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి CURE-PURE-RARE అనే మూడు-జోన్ల అభివృద్ధి నమూనాను.. ఈ డాక్యుమెంట్ కీలకంగా ప్రస్తావించింది.

హైదరాబాద్ సిటీతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పం.

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలు రాయిని నిర్దేశించింది. 2047 నాటికి జాతీయ GDPలో తెలంగాణ వాటా పదో వంతుకు చేరాలని లక్ష్యంగా ఎంచుకుంది.

పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్న అత్యాధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దటం.

అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టడం.

మూడు ఉత్ప్రేరకాలు:

సాంకేతికత , ఆవిష్కరణ – ఆధునిక టెక్నాలజీని పాలన, పరిశ్రమల్లో అనుసంధానం

సమర్థవంతమైన ఆర్థిక వనరులు – కొత్త ఆర్థిక నమూనాలు, ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ

సుపరిపాలన – పారదర్శకత, జవాబుదారీతనం, పౌర–కేంద్రీకృత పాలన

మూడంచెల వ్యూహం – CURE–PURE–RARE మోడల్

తెలంగాణ అభివృద్ధిని భౌగోళికంగా మూడు జోన్లుగా విభజించడం ఈ డాక్యుమెంట్ ప్రత్యేకత.

1. CURE – Core Urban Region Economy

హైదరాబాద్ సిటీ, 160 కిమీ ORR లోపల ప్రాంతం

సేవల రంగం, నాలెడ్జ్–ఇన్నోవేషన్ హబ్

నెట్–జీరో సిటీ లక్ష్యం

2. PURE – Peri-Urban Region Economy

ORR , 360 కిమీ RRR మధ్య ప్రాంతం

తయారీ రంగ అభివృద్ధి కేంద్రం

పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పాటు

3. RARE – Rural Agriculture Region Economy

RRR దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాలు

వ్యవసాయం, ఆగ్రి–బేస్డ్ ఇండస్ట్రీస్

హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి

ఈ మోడల్ భారతదేశంలోని ఏ రాష్ట్రం అమలు చేసిన తొలి విభజన కావడం విశేషం.

పది కీలక వ్యూహాలు

ఈ దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్ ప్రస్తావించింది.

1. 3-జోన్ల రాష్ట్రం: సమతుల్య అభివృద్ధికి CURE-PURE-RARE నమూనా.

2. విచక్షణ నుండి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.

3. గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్. రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు.

4. సమర్ధ పాలన: డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.

5. నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం .

6. సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అందరికీ సమాన అవకాశాలు.

7. అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.

8. పర్యావరణం, సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం.

9. సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. ప్రోత్సహించడం.

10. ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×