BigTV English

OTT Movie : ఫెరారీ కొనడానికి వచ్చే అందమైన అమ్మాయి… ఆమె చేసే పనికి సేల్స్ మెన్ కు పార్ట్స్ ప్యాక్

OTT Movie : ఫెరారీ కొనడానికి వచ్చే అందమైన అమ్మాయి… ఆమె చేసే పనికి సేల్స్ మెన్ కు పార్ట్స్ ప్యాక్

OTT Movie : రీసెంట్ గా వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లో మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ మూవీ డ్రగ్ డీలర్ చుట్టూ తిరుగుతుంది. అతన్ని పట్టుకునే క్రమంలో స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇందులో కార్ చేసింగ్ సీన్స్ మూవీకి హైలెట్ గా నిలుస్తాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వీకెండ్ ఇన్ తైపీ’ (Weekend in Taipei). దీనికి జార్జ్ హువాంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో లూక్ ఎవాన్స్, గ్వీ లున్-మీ, సంగ్ కాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫ్రాన్స్, తైవాన్ సంయుక్త నిర్మాణంగా రూపొందింది. తైపీ, తైవాన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. స్టోరీ ఒక డ్రగ్ డీలర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జాన్ లాలర్ ఒక అమెరికన్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. అతను తన ఉద్యోగానికి పూర్తిగా అంకితభావంతో ఉంటాడు. అతను మిన్నియాపోలిస్‌లో ఒక చైనీస్ రెస్టారెంట్‌లో రహస్యంగా పనిచేస్తూ, బిలియనీర్ అయిన డ్రగ్ డీలర్ క్వాంగ్ నేరాలకు సాక్ష్యాలు సేకరిస్తాడు. అయితే అతని సహోద్యోగి చేసిన ఒక తప్పు వల్ల జాన్ ఎవరో బయటపడుతుంది. దీంతో అతని ఆరు నెలల కష్టం వృథా అవుతుంది.ఈ సంఘటన తర్వాత, జాన్‌కు తైపీ నుండి ఒక ఇమెయిల్ లో ఒక సమాచారం వస్తుంది. అందులో క్వాంగ్ ఎంటర్‌ప్రైజెస్ ఆర్థిక లావాదేవీలు తన వద్ద ఉందని ఉంటుంది. అతను ఈ విషయాన్ని తన ఉన్నతాధికారికి తెలియజేసినప్పటికీ, అది నకిలీ అని తిరస్కరిస్తాడు. అతన్ని వారాంతపు సెలవు తీసుకోమని ఆదేశిస్తాడు. అయినప్పటికీ, జాన్ ఈ అవకాశాన్ని వదులుకోకుండా, నకిలీ గుర్తింపుతో తైపీకి వెళ్తాడు. మరోవైపు తైపీలో, క్వాంగ్ తన దత్తపుత్రుడు రేమండ్ తన లెడ్జర్‌ను దొంగిలించింది మోల్ అని తెలుసుకుంటాడు. రేమండ్, క్వాంగ్ డ్రగ్ డీలింగ్ గురించి తెలియక, లెడ్జర్‌లో డాల్ఫిన్‌లను చంపడం వంటి పర్యావరణ నేరాల ఆధారాలు ఉన్నాయని భావిస్తాడు. దాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు.

క్వాంగ్ భార్య జోయీ 15 సంవత్సరాల క్రితం క్వాంగ్‌ను వివాహం చేసుకున్న మాజీ రహస్య ఏజెంట్. తన కొడుకు రేమండ్ కోసం క్వాంగ్ ను వేడుకుంటుంది. అయితే, రేమండ్ లెడ్జర్‌ను ఒక స్నేహితుడికి అప్పగించినట్లు వెల్లడిస్తాడు. అతను దాన్ని తైపీలోని మారియట్ హోటల్‌లో జాన్‌కు అందజేయబోతాడు. జాన్ తైపీలో జోయీతో తిరిగి కలుస్తాడు. ఆమెను గతంలో అతను ప్రేమించి ఉంటాడు. వారి గతం, ప్రస్తుత పరిస్థితులు వారిని ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. జోయీ ఇప్పుడు క్వాంగ్ భార్య అయినప్పటికీ, ఆమెకు జాన్ మధ్య పాత యవ్వారం మళ్లీ చిగురిస్తుంది. జాన్, జోయీ క్వాంగ్‌ను ఎదుర్కోవడానికి, లెడ్జర్‌ను స్వాధీనం చేసుకోవడానికి కలిసి పనిచేస్తారు.ఫెరారీ కారు జోయీ నడిపినప్పుడు, జాన్ కి ప్యాంట్ తడిచి పోతుంది. ఇక్కడ కార్ చేసింగ్ లు కూడా ఓ రేంజ్ లో జరుగుతాయి. చివరికి క్వాంగ్ నేరాలకు సాక్ష్యాలు వీళ్ళు సాక్ష్యాలు సేకరిస్తారా ? క్వాంగ్‌ నుంచి రేమండ్ ను కాపాడుకోగలుగుతారా? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×