E-Paper
Advertisement

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Michael Movie OTT Release : పాప్ సంచలనం మైఖేల్ జాక్సన్ జీవితం ఇప్పుడు ఇంట్లో కూర్చునే చూడొచ్చు. డ్యాన్స్, పాటలు, లెజెండరీ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లతో దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఊపేసిన ఆ సూపర్ స్టార్ కథను ‘మైఖేల్’ (Michael) అనే టైటిల్ తో మేకర్స్ ఓ బయోపిక్ ను పేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ లో ట్విస్ట్

‘మైఖేల్’ మూవీ జూన్ 9 నుంచి బుక్‌మై షో స్ట్రీమ్లో రెంటల్ బేసిస్‌ లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో కూడా రెంటల్‌గా చూడవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా ఏప్రిల్‌ లో థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,100 కోట్లు వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. క్రిటిక్స్ నుంచి కొంత నెగెటివ్ రివ్యూలు వచ్చినా, మైఖేల్ ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను భారీగా ఆదరించారు. ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ డబ్బింగ్ కూడా ఉంది. అయితే తెలుగులో అందుబాటులోకి వస్తుందో లేదో చూడాలి. ఇక సబ్‌స్క్రిప్షన్ బేసిస్‌పై ఎప్పుడు వస్తుందనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. థియేటర్లలో మిస్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇంట్లో ఫుల్ స్క్రీన్‌లో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. మైఖేల్ జాక్సన్ లాంటి లెజెండ్ జీవితం చూడటం ఒక్కటే కాదు.. ఆయన డ్యాన్స్, మ్యూజిక్, ఎమోషన్ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ఇది సూపర్ అవకాశం.

Advertisement

Also Read : ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ నుండి ‘ఆఫీస్ రొమాన్స్’ వరకు… ఓటీటీలోకి 6 హాలీవుడ్ మూవీస్

కథ ఏమిటి?

మైఖేల్ జాక్సన్ బాల్యం నుంచి సూపర్ స్టార్ అయ్యే వరకు ఆయన జీవితం, కష్టాలు, విజయాలు, వ్యక్తిగత సమస్యలు అన్నీ ఈ సినిమాలో చూపించారు. ఆయన డ్యాన్స్ స్టెప్స్, ఐకానిక్ పాటలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. ఆయన జీవితంలోని హైస్, లోస్‌ను బ్యాలెన్స్‌ గా చూపించడం ఈ సినిమా ప్రత్యేకత.

Advertisement

Also Read : 2 గంటల 41 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… ఫహద్ ఫాజిల్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరు

ఎవరు ఏ పాత్రలో నటించారు?

మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే నిజంగా మైఖేల్ గుర్తు రాక మానడు. నియా లాంగ్, జూలియానో వాల్డి వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించగా, లియోర్ రోస్నర్ మ్యూజిక్ అందించాడు.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×