E-Paper
Advertisement

వైఫై సిగ్నల్స్ అంటే ఎలర్జీ… ఏ గ్రహం నుంచి వచ్చింది భయ్యా ? జెన్ జీ కిడ్స్ డోంట్ మిస్

వైఫై సిగ్నల్స్ అంటే ఎలర్జీ… ఏ గ్రహం నుంచి వచ్చింది భయ్యా ? జెన్ జీ కిడ్స్ డోంట్ మిస్
Advertisement

Time Travel Sci Fi Movie: సరదాగా ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్ తోనో కలిసి తినడానికి ఏ రెస్టారెంట్ కో వెళ్ళాము అనుకోండి. అలాంటి టైమ్ లో సడన్ గా ఒక వింత మనిషి వచ్చి, తాను భవిష్యత్తును మార్చడానికి బాంబులు కట్టుకుని మరీ వచ్చాను అంటే… ప్రతీ ఒక్కరూ పగలబడి నవ్వుతారు. కానీ అదే వ్యక్తి అక్కడున్న ముక్కూ మొహం తెలియని వ్యక్తుల పేర్లు చెబుతూ… 100 కంటే ఎక్కువ సార్లు ఇదే ప్రయత్నం చేశాను అని ప్రూవ్ చేసుకుంటే… ఎలా ఉంటుందో తెలియాలంటే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం ‘గుడ్ లక్, హ్యావ్ ఫన్, డోంట్ డై’ (Good Luck, Have Fun, Don’t Die)ని చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలియాలంటే, ముందు స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి.

కథలోకి వెళ్తే…

లాస్ ఏంజిల్స్ నగరంలోని ఒక రెస్టారెంట్ లో కథ షురూ అవుతుంది. ప్లాస్టిక్ కవర్లు, వింత ట్యూబులు ఒంటికి చుట్టుకుని, చేతిలో బాంబుతో ఓ వ్యక్తి రెస్టారెంట్ లోకి దూసుకొస్తాడు. తాను భవిష్యత్తు నుండి టైమ్ ట్రావెల్ చేసి వచ్చానని, అక్కడి వారికి చెప్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా కారణంగా భవిష్యత్తులో మానవజాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదంలో పడిందని అతను హెచ్చరిస్తాడు.

Advertisement

ఆ ఘోర విపత్తును ఆపాలంటే, భవిష్యత్తులో ఈ ఘోరమైన AI టెక్నాలజీని కనిపెట్టబోయే ఒక 9 ఏళ్ల బాలుడిని ఇప్పుడే అడ్డుకోవాలని చెప్తాడు. ఈ ప్రమాదకరమైన మిషన్ కోసం ఆ హోటల్‌లో తింటున్న ఆరుగురు వ్యక్తులను అతను సెలెక్ట్ చేసుకుంటాడు. టీచర్ దంపతులు, ఒక బాధిత తల్లి, మరికొందరు కస్టమర్లు… వీరంతా నార్మల్ మనుషులే. విచిత్రం ఏమిటంటే… ఈ మిషన్‌ను సక్సెస్ చేయడానికి అతను ఇప్పటికే 117 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యి ఉంటాడు. ఇది అతని 118వ ప్రయత్నం.

ఈ ఆరుగురు వ్యక్తులను తీసుకుని, అతను బయలుదేరిన ఆ రాత్రి, ప్రయాణంలో ఊహించని వింత సంఘటనలు ఎదురవుతాయి. మైండ్ కంట్రోల్ చేస్తున్న టీనేజర్లు, భవిష్యత్తు నుండి వచ్చిన బౌంటీ హంటర్లు వారిపై దాడి చేస్తారు. ఈ గందరగోళంలో అడుగడుగునా కామెడీ, యాక్షన్ సీన్స్ తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సామ్ రాక్‌వెల్ తన తెలివితేటలతో ఈ మిషన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తాడు? ఆరుగురు మనుషులు తమ జీవితాల్లో ఎదుర్కొన్న బాధలు, భయాలు, ఆశలు ఈ పెద్ద మిషన్‌లో ఎలా కలిసిపోతాయి? చివరికి ఏమైంది ? అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిన విషయం.

తెలుగులో ఉందా ?

Advertisement

ముందు ముందు మన ప్రపంచం ఎలా మారబోతోంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా మనల్ని ఎంత దూరం తీసుకెళ్తున్నాయి ? అనేది తెలిపే సినిమానే ఇది. గోర్ వెర్బిన్స్కి దర్శకత్వంలో సామ్ రాక్‌వెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా టెక్నాలజీ సృష్టించే వినాశనం గురించి ఆలోచింపజేసేలా ఉంటుంది. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఇంకా రాలేదు.

Read Also: రాత్రి వేళల్లో సేవకులను చంపి తినే రాజు… క్రేజీ కొరియన్ హిస్టారికల్ హర్రర్ థ్రిల్లర్ సిరీస్

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×