E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో వచ్చిన మోస్ట్ పాపులర్ ఓటీటీ సిరీసుల లిస్ట్… ఇందులో మీరెన్ని చూశారు ?

Year Ender 2025 : 2025లో వచ్చిన మోస్ట్ పాపులర్ ఓటీటీ సిరీసుల లిస్ట్… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Year Ender 2025 :  2025లో చాలామందికి వెబ్ సిరీస్‌లు చూడడం అన్నది రోజువారీ అలవాటుగా మారింది. ఈ ఏడాది కొన్ని కథలు నిజ జీవితానికి దగ్గరగా అనిపించాయి. మరికొన్ని ప్రజలను నవ్వించాయి. కొన్ని షోలు భయపెట్టాయి, మరికొన్ని ఆలోచింపజేశాయి. క్రైమ్ కథల నుంచి విలేజ్ డ్రామాలు, స్పై థ్రిల్లర్లు. హర్రర్ షోలు, కోర్టు రూమ్ డ్రామాలు ఇలా అన్ని జానర్లలో సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. IMDb ర్యాంకింగ్స్ ప్రకారం ఈ ఇయర్ పాపులర్ అయిన సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Bads of Bollywood)

మొదటి స్థానంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఉంది. షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఈ సిరీస్ తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. బాలీవుడ్ లోకి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ చేసిన కామియోలు ఉత్సాహాన్ని పెంచాయి. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఐఎండీబీలో దాదాపు 39,000 ఓట్ల ఆధారంగా 10కి 7.6 రేటింగ్‌ను పొందింది.

2. బ్లాక్ వారెంట్ (Black Warrant)

Advertisement

బ్లాక్ వారెంట్ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచే దృష్టిని ఆకర్షించింది. శశి కపూర్ మనవడు జహాన్ కపూర్ ప్రధాన పాత్ర పోషించాడు. కథ తీహార్ జైలులో జరుగుతుంది. ఐఎండీబీలో ‘బ్లాక్ వారెంట్’ దాదాపు 7,800 ఓట్లతో 7.9 రేటింగ్‌ను దక్కించుకుంది.

3. పాతాళ్ లోక్ సీజన్ 2 (Paatal Lok Season 2)

మొదటి సీజన్ తర్వాత ఐదు సంవత్సరాలకు ‘పాతాళ్ లోక్ సీజన్ 2’ వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సీజన్ ఐఎండీబీలో 8.3 రేటింగ్ ని సంపాదించింది.

4. పంచాయత్ సీజన్ 4 (Panchayat Season 4)

Advertisement

పంచాయత్ సీజన్ 4 తో తన విజయ పరంపరను కొనసాగించింది. ఈ షో మరోసారి ప్రేక్షకులను ఫులేరా గ్రామానికి తీసుకెళ్లింది. ఐఎండీబీలో “పంచాయత్ సీజన్ 4″కి 115,000 కంటే ఎక్కువ ఓట్లతో 9.0 రేటింగ్‌ ఉంది.

5. మండల మర్డర్స్ (Mandala Murders)

ఐదవ స్థానంలో మండల మర్డర్స్ ఉంది. ఈ సిరీస్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుండి వచ్చింది. జూలైలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇది దాదాపు 6,100 ఓట్లతో ఐఎండీబీలో 6.5 రేటింగ్‌ను పొందింది.

6. ఖౌఫ్ (Khauf)

ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ షో భయాన్ని భావోద్వేగంతో కలిపింది. ఢిల్లీలోని ఒక హాస్టల్ గది చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ ఉంటున్న ఒక యువతి వింత సంఘటనలను అనుభవించడంతో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ మొదలవుతాయి. ఐఎండీబీలో ‘ఖౌఫ్’ 5,400 ఓట్లతో 7.4 రేటింగ్‌ను సంపాదించింది.

7. స్పెషల్ ఆప్స్ సీజన్ 2 (Special Ops Season 2)

స్పెషల్ ఆప్స్ సీజన్ 2 ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సిరీస్ లలో ఒకటి. కెకె మీనన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హిమ్మత్ సింగ్ గా తిరిగి వచ్చాడు. మొదటి సీజన్ అభిమానులు సీక్వెల్‌ను హృదయపూర్వకంగా స్వాగతించారు. జియోహాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్ 43,000 కంటే ఎక్కువ ఓట్లతో 8.6 రేటింగ్‌ను పొందింది.

8. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (Khakee: The Bengal Chapter)

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ 2000ల ప్రారంభంలో బెంగాల్‌లో నేరాలు, రాజకీయాల నేపథ్యంలో, నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ఈ షో దాదాపు 6,100 ఓట్లతో 7.5 రేటింగ్‌ను కలిగి ఉంది.

9. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (The Family Man Season 3)

చాలా కాలం వేచి చూసిన తర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ ఎట్టకేలకు వచ్చింది. మనోజ్ బాజ్‌పేయి మరోసారి శ్రీకాంత్ తివారీ పాత్రను పోషించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ 8.7ని సంపాదించింది. దీనికి ఐఎండీబీలో 110,000 కంటే ఎక్కువ ఓట్ల పడ్డాయి.

10. క్రిమినల్ జస్టిస్ – ఎ ఫ్యామిలీ మేటర్ (Criminal Justice – A Family Matter)

ఆ జాబితా చివరిలో ‘క్రిమినల్ జస్టిస్ – ఎ ఫ్యామిలీ మేటర్’ ఉంది. పంకజ్ త్రిపాఠి నటించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో కుటుంబ రహస్యాలతో ముడిపడి ఉన్న హత్య కేసు గురించి ఉంటుంది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also :  ఫిల్మ్ ఫేర్ లో దుమ్మురేపిన సినిమాలు, సిరీస్ లు… ఏది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×