E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న బాలు.. మనోజ్ ను తిట్టిన ప్రభావతి..బాలు పై రాజేష్ ప్రశంసలు..

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న బాలు.. మనోజ్ ను తిట్టిన ప్రభావతి..బాలు పై రాజేష్ ప్రశంసలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి రవి సిగ్గుబిళ్ళ ఫోటో ని చూసి ఆడుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన బాలు మీనా ఏంట్రా శృతిని ఏడిపిస్తున్నావా అని అడుగుతారు.. నేను ఏడిపించడం కాదు అదే నన్ను ఏడిపిస్తుంది అని రవి అంటాడు.. దాని గురించి తెలుసుకున్న మీనా ఆ ఫోటోని ఇప్పుడు చూపించకుండా ఉండడమే మంచిది అని అంటుంది. ఇక ప్రభావతి సత్యం ఇద్దరు కలిసి ఇంటికి రావడంతో అందరూ షాక్ అవుతారు. వీరిద్దరూ మొత్తానికి కలిసిపోవడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు. మొత్తానికి ఒక్కటైన ఈ జంటతో ఇంట్లోని వాళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటారు. మీనా తో పాటు శృతి కూడా ప్రభావతిని ఆడుకుంటుంది. ప్రభావతి సత్యం ఇద్దరూ కలిసిపోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు.. ప్రభావతి మాత్రం వాళ్ళందరూ అంటూ ఉంటే సిగ్గుపడుతూ ఉంటుంది. సువర్ణ చెప్పడంతో సంజయ్ మౌనికని కూడా పార్టీకి తీసుకొని వెళ్తాడు. అక్కడ మౌనిక బాలుని చూసి ఎవరో తెలియదు అని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు మౌనిక అలా మాట్లాడడం తట్టుకోలేకపోతుంటాడు.. ఇంటికి రాగానే మీనా ఏమైంది అని అడుగుతుంది.. బాలు మౌనిక కనిపించింది కానీ తన మాటలు విని నేను చాలా బాధపడ్డాను అని అనగానే మీనా అర్థం చేసుకున్నాను అని అంటుంది. మౌనిక అలా మాట్లాడటం చూసి నేను షాక్ అయిపోయాను.. నా గుండెల మీద తన్నింది కదా నా చెంప దెబ్బ కొట్టినా నేను ఫీల్ అవ్వలేదు.. అలాంటి మౌనిక ఇప్పుడు ఆ పార్టీలో ఎవరో తెలియదు అని అనడంతో నాకు చాలా బాధేసింది అని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. తర్వాత మీనా ఏదో సంజయ్ వల్ల అలా మాట్లాడి ఉంటుంది కానీ మీరు ఏమి మనసులో పెట్టుకోకండి అని అంటుంది.

Advertisement

నేను కూడా మొదట అదే అనుకున్నాను వాడివల్లే నన్ను దూరం పెట్టింది అని అనుకున్నాను. కానీ ఇప్పటికైనా ఒకసారి ఫోన్ చేసి అలా చేశాను అని ఒక్క మాట చెప్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను కదా అని బాలు బాధపడుతూ ఉంటాడు.. అలా పార్టీలో అలసిపోయి ఉంటుంది రేపు ఫోన్ చేసి చెప్తుంది లేండి అని మేన బాలుని ఓదారుస్తుంది.. తర్వాత బాలు ఏమో మౌనిక పూర్తిగా మారిపోయింది అని అనుకుంటున్నాను అని అంటాడు.. ఇక మనోజ్ రాత్రి ఆ లెటర్ ఇచ్చింది ఎవరు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. ఈ లెటర్ ఎవరు రాసి ఉంటారు నా చుట్టూ ఉన్న వాళ్ళలో రోహిణిని ఉంది కదా మరి రోహిణి నేను ఇదంతా చేసిందా అని ఆలోచిస్తూ ఉంటారు.

ఎవరు చేసుంటారు అని భయపడుతూ ప్రభావతికి ఫోన్ చేస్తాడు.. అయితే ప్రభావతి ఈ టైంలో మీరు ఫోన్ చేస్తున్నాడేంటి కచ్చితంగా నాకు ఏదో మూడింది. వీడే నన్ను మల్ల ఇంకొక సమస్యలకు నెట్టు ఎలా ఉన్నాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఏంట్రా ఫోన్ చేశావు అది కూడా ఈ టైంలో చేసావు అని ప్రభావతి అడుగుతుంది.. నువ్వేం చేస్తున్నావ్ అమ్మ అని మనోజ్ అడుగుతాడు. నేను బిర్యాని చేస్తున్నాను రా వచ్చి తినిపోదు రా నీ ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది.. కానీ ప్రభావతి మాత్రం ఈ టైంలో ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావ్ అంటావేంట్రా అని తిడుతుంది. నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పరా అని అంటే నువ్వు కచ్చితంగా పైకి రామ్మా ఒకసారి అని అడుగుతాడు మనోజ్.

Advertisement

ప్రభావతి పైకి రాగానే ఏమైందిరా ఎందుకు మళ్ళీ రమ్మన్నావు ఏదైనా పెడుతున్నావా ఏంటి ముందే చెప్పరా. నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని ప్రభావతి అంటుంది.. నువ్వు నా మంచి కొరేదానివి అనుకున్నాను ఇప్పుడు నన్ను ఇలా అంటావ్ ఏంటి..? నన్నే ఇంత మాట అంటావా ఏంట్రా నువ్వు అని ప్రభావతి మనోజ్ ని కొడుతుంది. నువ్వు నా మంచి కొడతావ్ అనుకున్నాను కానీ ఇలా అంటావ్ ఏంటి అని ప్రభావతి అంటుంది.. నువ్వు నా శత్రువు లాగా మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు నిజంగానే మారిపోయావు అని మనోజ్ అంటాడు.. ఆ మాట వినగానే ప్రభావతి మనోజ్ నీ దారుణంగా తిడుతుంది..

ఇప్పుడు ఒక సమస్యలో ఉన్న అమ్మా సమస్య నుంచి నువ్వే బయట పడేయాలి అని ప్రభావతిని అడుగుతాడు మనోజ్.. నీ వల్ల వేరే వాళ్లకు సమస్యలు వస్తాయి కానీ నీకు సమస్య వచ్చిందా అదేంటి అని ప్రభావతి అంటుంది.. ఊరుకోమ్మా ఇదో ఈ లెటర్ చూడు అని ఆ లెటర్ చూపిస్తాడు.. ఆ లెటర్ చూసిన ప్రభావతి నువ్వు 50 వేలు కట్టాలి అని అన్నారు కదా దాని ఎగ్గొట్టడానికి ఇదొక ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని ప్రభావతి అంటుంది.. నా మీది నీకు ఆమాత్రం కూడా నమ్మకం లేదా అమ్మ.. ఎందుకమ్మా ఇలా మారిపోయావు అని మనోజ్ అడుగుతాడు.. ఇలా నాతో మాట్లాడవని బాలు గనుక చూస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని ప్రభావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

ఇక రాజేష్ తర్వాత రోజు ఇంటికి రావడంతో బాలు ఏంట్రా రాజేష్ వచ్చాడు అని సత్యం అడుగుతాడు.. నా కొత్త కారు ఉంది కదా నాన్న ఆ కారుని వీడికి ఇద్దామని అనుకుంటున్నాను అని బాలు అంటాడు. కొత్త కార్ ఏంటి పాత కారే కదా అని మనోజ్ అంటాడు. నా సెకండ్ హ్యాండ్ కారు రాజేష్ కి అద్దెకి ఇవ్వాలని అనుకుంటున్నాను అని బాలు అంటాడు.. మీనా వెళ్లి తీసుకురా అని అంటాడు.. సత్యం కారు తాళాలను రాజేష్ కి ఇస్తాడు. మీరు మంచి స్నేహితులు కాబట్టి లావాదేవీల విషయంలో ఎక్కడ గొడవ పడకుండా మంచిగా ఇలానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని సత్యం అంటాడు. ఆ విషయం నాకు వదిలేసేయండి మావయ్య గారు నేను చూసుకుంటాను అని మీనా అంటుంది.

Also Read : బిగ్ బాస్ తనూజ రియల్ స్టోరీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన ఎంతంటే..?

ఇక తర్వాత సెకండ్ హ్యాండ్ కార్ కి ఇంత బిల్డప్ ఇస్తున్నారే ఇది ఏదో పెద్ద విమానం ఇచ్చినట్లు అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే మీనా ఏం మాట్లాడారు.. ఏం మా ఆయన గురించి మీకు తెలియదు అని అంటుంది.. బిజినెస్ మాన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అని అంటాడు. స్టేటస్ అంటే ఏంటి వేరే వాళ్ళ నగలని దొంగతనం చేసి అమ్ముకొని బిజినెస్ ని పెంచుకోవాలని అనుకోవడమా అని మనోజ్ గాలిని తుస్సున తీసేస్తుంది మీనా.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×