E-Paper
Advertisement

Year Ender 2025 : ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూస్ కొల్లగొట్టిన 2025 సూపర్ ఫ్లాప్ సినిమాలు… లిస్ట్ లో ఎన్టీఆర్ మూవీ కూడా

Year Ender 2025 : ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూస్ కొల్లగొట్టిన 2025 సూపర్ ఫ్లాప్ సినిమాలు… లిస్ట్ లో ఎన్టీఆర్ మూవీ కూడా

Year Ender 2025 : 2025 కి కొన్ని రోజుల దూరంలో ఉంది. ఈ సంవత్సరం వినోద పరిశ్రమకు చాలా ముఖ్యమైనది. చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు పరాజయం పాలయ్యాయి, చాలా తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. కానీ ఈరోజు, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన కానీ OTT ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకుల నుండి అపారమైన ప్రేమను సంపాదించిన చిత్రాల గురించి మనం మాట్లాడుకుందాం.

గేమ్ ఛేంజర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతికి విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామా దాదాపు మూడు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది. ఎంతగానో ఎదురు చూశాక ఎట్టకేలకు జనవరి 10న తెరపైకి వచ్చింది. డిజాస్టర్ గా మిగిలి నిర్మాతలకు దాదాపు 50 కోట్ల నష్టాన్ని కలిగించిందని సమాచారం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

రాబిన్‌హుడ్

నితిన్ – వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌పై హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటించింది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 14 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఏడాది నితిన్ నటించిన మరో మూవీ’తమ్ముడు’ కూడా ఉంది.

జాక్

టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెస్ తర్వాత, సిద్ధు జొన్నలగడ్డ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మూవీ ‘జాక్’. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు మాత్రమే సంపాదించి, డిజాస్టర్ గా ముగిసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని చూడవచ్చు.

కింగ్‌డమ్

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ రిలీజ్ అయ్యాక 80 కోట్లు మాత్రమే సంపాదించింది. ఈ యాక్షన్ డ్రామాను మొదట రెండు భాగాల ఫ్రాంచైజీగా ప్లాన్ చేశారు. కానీ మొదటి భాగం డిజాస్టర్ కావడంతో రెండవ భాగానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఘాటీ

2025లో అనుష్క శెట్టి నటించిన సినిమా ‘ఘాటి’. ఆమె డ్రగ్స్ వ్యాపారిగా ఇందులో పవర్ ఫుల్ పాత్ర పోషించింది. కానీ దర్శకుడు క్రిష్ ప్రేక్షకులను పేలవమైన కథతో నిరాశపరిచాడు. ఈ చిత్రంతో విక్రమ్ ప్రభు తెలుగులోకి అడుగు పెట్టాడు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

హరి హర వీరమల్లు

గత మూడు సంవత్సరాలుగా నిర్మాణ దశలో ఉండి, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన పవన్ కళ్యాణ్ అతిపెద్ద చిత్రం ‘హరి హర వీర మల్లు’. 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కేవలం 100 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ పరాజయం పాలైంది. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

2025లో వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ , రవితేజ ‘మాస్ జాతర’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, మోగ్లీ, 12A రైల్వే కాలనీ, మిత్ర మండలి, అర్జున్ S/O వైజయంతి, 350 కోట్లతో రూపొంది, 286 కోట్లు రాబట్టిన కూలీ, హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ స్పై యాక్షన్ చిత్రం ‘వార్ 2’, ‘ది బెంగాల్ ఫైల్స్’, ‘ఎమర్జెన్సీ’ వంటి సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి .

Read Also :  అబ్బాయి ఇంట్లో తిష్ట వేసే మంత్రగత్తే.. ఇది వణికించే హర్రర్ మూవీ

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×