E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో స్టాండ్ అవుట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఓటీటీ స్టార్స్ వీళ్ళే… ఒక్కొక్క స్టార్ ఒక్కో ఆణిముత్యం

Year Ender 2025 : 2025లో స్టాండ్ అవుట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఓటీటీ స్టార్స్ వీళ్ళే… ఒక్కొక్క స్టార్ ఒక్కో ఆణిముత్యం
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరం అభిమానులకు మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలను సినిమాలు, సిరీస్ ల రూపంలో ఇచ్చింది. ఇక ఈ ఏడాది రిస్కీ రోల్స్ చేయడంతో పాటు తమకు దర్శకులు ఇచ్చిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్న నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2025లో ఓటీటీలో బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నటీనటులు ఎవరో ఇయర్ ఎండ్ సందర్భంగా తెలుసుకుందాం పదండి.

‘మయసభ’లో ఆది పినిశెట్టి (Mayasabha)

పీరియాడిక్ డ్రామా ‘మయసభ’ ఈ ఏడాది వచ్చిన బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ లలో ఒకటి. ఆది పినిశెట్టి (Aadi Pinisetty), చైతన్య రావు ఈ సిరీస్ లో ఎంత అద్భుతంగా నటించారంటే ప్రేక్షకులకు అదొక ఐ ఫీస్ట్. దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ముగ్గురు లెజెండరీ పోలిటిషియన్స్ చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలను ఆధారంగా తెరకెక్కింది. సోని లివ్ లో ఉంది ఈ సిరీస్.

సాన్య మల్హోత్రా – మిసెస్ ( Mrs)

Advertisement

సన్యా మల్హోత్రా ‘మిసెస్’ మూవీలో రిచా అనే నృత్యకారిణిగా, గృహిణిగా నటించింది. అత్తారింటికి అడుగు పెట్టాక ఒక అమ్మాయి తన ఆశలు అన్నింటినీ చంపుకుని ఎలా వంటింటి కుందేలుగా మారుతుంది అనేది ఈ మూవీ స్టోరీ. ఇందులో గృహిణిగా సన్యా (Sanya Malhotra) నటన ప్రశంసనీయం.

పశుపతి – కుట్రం పురింధవన్ ( Kuttram Purindhavan)

క్రైమ్ థ్రిల్లర్ ‘కుట్రమ్ పురింధవన్‌’లో పసుపతి (Pasupathy) కలవరపెట్టే పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు.

అభిషేక్ బచ్చన్ – కాళీధర్ లాపాట (Kaalidhar Laapata)

Advertisement

‘కాళిధర్ లాపాట’ అనే డ్రామా సినిమాలో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) అద్భుతమైన నటనను కనబరిచారు. మతిమరుపు ఉన్న వ్యక్తిని తన కుటుంబం విడిచి పెట్టినప్పుడు, ఒక అనాథ బాలుడితో అతని బంధం సినిమాలో హైలెట్. ఇందులో అభిషేక్ నటన హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

బాబిల్ ఖాన్ – లాగ్అవుట్ (Babil Khan – Logout)

ఖాలా, ది రైల్వే మెన్ చిత్రాల తర్వాత బాబిల్ ఖాన్ ‘లాగ్ అవుట్’ అనే సైబర్ టెక్ థ్రిల్లర్ లో ఆసక్తికరమైన నటనతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

అభిషేక్ బెనర్జీ – స్టోలెన్ Abhishek Banerjee – Stolen

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అభిషేక్ బెనర్జీ, తన తమ్ముడితో కలిసి మనుగడ కోసం సవాలుతో కూడిన రోడ్ ట్రిప్‌ను ప్రారంభించే అన్నయ్య పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాను చూశాక గౌతమ్ బన్సాల్‌గా అభిషేక్ బెనర్జీని మర్చిపోవడం అంత సులభం కాదు.

అలాగే ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లో రాఘవ్ జుయల్, ‘పాతాళ్ లోక్ 2’లో తిలోత్తమ షోమే, ‘ఖౌఫ్’లో మోనికా పన్వర్, ‘కంఖజుర’లో రోషన్ మాథ్యూ, ‘బ్లాక్ వారెంట్’లో జహాన్ కపూర్ నటన అవుట్ స్టాండింగ్ అని చెప్పవచ్చు.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×