E-Paper
Advertisement

Youth Comedy Drama OTT : ఈ ట్యూషన్ టీచర్ గట్స్ కు దండం పెట్టాలి భయ్యా… మొద్దు నుంచి దేశంలోనే టాప్ స్టూడెంట్ గా… స్టూడెంట్స్ డోంట్ మిస్

Youth Comedy Drama OTT : ఈ ట్యూషన్ టీచర్ గట్స్ కు దండం పెట్టాలి భయ్యా… మొద్దు నుంచి దేశంలోనే టాప్ స్టూడెంట్ గా… స్టూడెంట్స్ డోంట్ మిస్
Advertisement

Youth Comedy Drama OTT : ఒక రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన జపనీస్ మూవీ ఎంతో మంది స్టూడెంట్స్ కి మోటివ్ అవుతోంది. దర్శకుడు కామెడీని కలిపి దీనిని ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాడు. ఇది 2015లో జపాన్‌లో అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. సరైన వ్యక్తి మార్గదర్శకుడుగా ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఈ చిత్రం నిరూపిస్తుంది. మీరు ఈ సినిమాను చూడాలనుకుంటే, ఇది ఒక మంచి మోటివేషనల్ మూవీగా ఉంటుంది. ఈ సినిమా కేవలం విద్యార్థులకే కాకుండా, జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. మరి ఇలాంటి సినిమాను మిస్ కాకుండా చూసేయండి. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

నోబుహిరో డోయి దర్శకత్వం వహించిన ఈ జపనీస్ యూత్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘ఫ్లయింగ్ కలర్స్’ (Flying colors). దీనిని జపనీస్‌లో ‘బిరి గల్’ (Biri Gal) అని కూడా పిలుస్తారు. ఇందులో సయాకా కుడో అనే విద్యార్థి పాత్రలో కసుమి అరిమురా నటించింది. ఉపాధ్యాయుడిగా అట్సుషి ఇటో నటించారు. ఈ సినిమా 2015 మే 1న జపాన్‌లో విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సయాకా కుడో అనే అమ్మాయి ఒక అల్లరి చసే హైస్కూల్ విద్యార్థిని. ఆమెకు చదువుపై అస్సలు ఆసక్తి ఉండదు. కేవలం ఫ్యాషన్, స్నేహితులతో సరదాగా గడపడమే ఆమె పని. ఆమె చదువులో ఎంత ఘోరంగా ఉంటుందంటే, హైస్కూల్ చదువుతున్నా ఆమెకు 4వ తరగతి విషయాలు కూడా తెలియవు. అయితే ఒక గొడవ కారణంగా ఆమె స్కూల్ నుండి సస్పెండ్ అవుతుంది.దీంతో ఆమె తల్లి సయాకాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చేర్పిస్తుంది. అక్కడ ఆమెకు సుబోటా అనే ఉపాధ్యాయుడు టీచింగ్ ఇస్తాడు. ఆయన సయాకాలోని ప్రతిభను గుర్తించి, జపాన్‌లోనే అత్యంత కష్టమైన ‘కియో యూనివర్సిటీ’లో సీటు సాధించాలని ఆమెకు ఒక పెద్ద టార్గెట్ ఇస్తాడు.

మొదట్లో అందరూ సయాకాను ఎగతాళి చేస్తారు.ముఖ్యంగా ఆమె తండ్రి, స్కూల్ టీచర్లు ఆమె వల్ల ఏమీ కాదని తక్కువ అంచనా వేస్తారు. కానీ టీచర్ సుబోటా ఇచ్చే ప్రోత్సాహంతో, సయాకా తనను తాను నిరూపించుకోవాలని పట్టుదలగా శ్రమిస్తుంది. తన జుట్టును కత్తిరించుకుని, విలాసాలకు దూరంగా ఉంటూ రోజుకు 15 గంటలకు పైగా చదువుతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, తన తల్లి, గురువు సపోర్ట్ తో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేస్తుంది. చివరికి అందరూ ఆశ్చర్యపోయేలా తన లక్ష్యాన్ని చేరుకుని, కియో యూనివర్సిటీలో సీటు సాధిస్తుంది.

Advertisement

Read Also : పిల్ల బచ్చాకు సూపర్ పవర్స్… ఇన్నాళ్ళూ ఈ మూవీని ఎలా మిస్ అయ్యాం మావా

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×