ananya nagalla (7)
Ananya Nagalla Birthday Celebrations: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోయిన్లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అనన్య నాగళ్ల. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన అనన్య 'మల్లేశం' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది.
ananya nagalla (4)
ఆ తర్వాత 'ప్లే బ్యాక్' అనే ఓ సినిమా చేసింది. కానీ, ఆమెకు కెరీర్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'. ఈ సినిమాలో నటించిన ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఓ పాత్ర పోషించింది.
ananya nagalla (3)
అంజలి, నివేతా థామస్, అనన్యల ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో ఆమె దివ్య నాయక్ అనే పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత అనన్యకి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది.
ananya nagalla (5)
ప్రస్తుతం చిన్న సినిమాలు, విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు హీరోయిన్ అంటే అనన్యకే ఓటేస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన చేస్తున్న ఆమె సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ananya nagalla (2)
తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. అయితే ఇవాళ ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది.
ananya nagalla (6)
ఆగస్టు 01 తన పుట్టినరోజు కావడంతో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసి ఫొటోలకి పోజులిచ్చింది. ఈ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పొట్టి డ్రెస్లో అనన్య తీసుకున్న ఫొటోలు అదిరిపోయాయి.
ananya nagalla (1)
అలానే చీరలో అనన్య షేర్ చేసిన ఫొటో కూడా మాములుగా లేదు. ఈ పుట్టినరోజుతో 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. గతేడాది అనన్య నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాల్లో అనన్య యాక్ట్ చేస్తోంది.