BigTV English
Advertisement

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. తెలుగులో 9వ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే 8 వారాలు పూర్తికాగా.. 9వ వారం కూడా ఆరంభం అయింది. ఇకపోతే ఈ వారం 59వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో టచ్ ఇట్.. స్మెల్ ఇట్.. టేస్ట్ ఇట్.. అంటూ ఒక టాస్క్ నిర్వహించగా బిగ్ బాస్ ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న తనుజాకి తడిసిపోయింది. అటు లేడీ సింగంలా రీతు చౌదరి రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది. మరి ప్రోమోలో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


కొత్త టాస్క్..

తాజాగా బిగ్ బాస్ నుండి విడుదల చేసిన ప్రోమోలో.. నామినేషన్ ప్రక్రియ ముగియగా.. మరొకవైపు కంటెండర్ షిప్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బిగ్ బాస్ తాజాగా ఒక టాస్క్ నిర్వహించారు. టాస్క్ గురించి సాయి వివరిస్తూ.. టీం కి ఇస్తున్న టాస్క్.. టచ్ ఇట్.. స్మెల్ ఇట్.. టేస్ట్ ఇట్.. కానీ ఈ ప్రక్రియ సమయంలో యాక్టివిటీ ఏరియా చాలా డార్క్ గా ఉంటుంది. అంటూ టాస్క్ వివరించగా.. బిగ్ బాస్ ముద్దుబిడ్డగా పేరు సొంతం చేసుకున్న తనూజ మొదట ఆ డార్క్ రూమ్లోకి ప్రవేశించింది. ప్రవేశించగానే అక్కడ మొత్తం చీకటిగా ఉండడం అటుంచితే ఫియర్ మోడ్ ఆన్ అయినట్టు అనిపించింది. అక్కడ ఎక్కువగా దెయ్యాలు, భూతాలను తలపించేలా వాతావరణాన్ని సృష్టించారు.

ముద్దుబిడ్డనే భయపెట్టేసిన బిగ్ బాస్..

తనూజ మాట్లాడుతూ.. బిగ్ బాస్ నాకు చాలా భయం వేస్తోంది. నావల్ల కావట్లేదు.. వెళ్ళిపోతాను అంటూ ఏడుపు ముఖం పెట్టేసింది. సంజన గారు ఇక్కడ ఎన్ని ఉంటాయని అడగగా వెతకండి అంటూ సంజన సమాధానం చెప్పింది. దానికి తనూజ నామీద పాత కక్షలన్నీ పెట్టుకొని ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటున్నారా ఏంటి అంటూ భయపడిపోయింది. ఆ డార్క్ రూమ్ లో ఉండలేక భయపడి పోయి ఒక్కసారిగా బయటకొచ్చి సంజనను పట్టుకొని ఏడ్చేసింది తనూజ. ఇది చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ తన ముద్దుబిడ్డనే ఏడిపించాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు..


అదరగొట్టేసిన రీతూ చౌదరి..

ఆ తర్వాత రీతు చౌదరి వంతు వచ్చింది సంజన. రీతు చాలా జాగ్రత్తగా ఆడు అని చెబితే నేను ఆడ పులిని అంటూ రెచ్చిపోతూ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత భయపడుతూ యాక్టింగ్ తో అదరగొట్టేసిన ఈమె .. చివర్లో గట్టిగా నవ్వుతూ తాను నిజంగానే ఆడ పులిని అనిపించింది. అలా మొత్తానికి అయితే ఈ ప్రోమో కాస్త ఎండ్ అయింది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు? ఎవరు తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు అనే విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు చూడాల్సిందే.

 

ALSO READ:Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

Related News

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Big Stories

×