AP Politics: మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారా? నేతలను అధినేత అడ్డంగా బుక్ చేస్తున్నారా? వైసీపీ ప్రభుత్వంపై మంత్రులు కొనసాగిన చాలామందిపై కేసులు నమోదు అయ్యాయా? ఇప్పుడు నేతల వంతైందా? టూర్ల పేరుతో నేతలకు ఇరికిస్తున్నారా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
వరుస కేసులతో వైసీపీ నేతలు బెంబేలు
అధికారంలో ఉన్నా.. లేకున్నా జగన్ తీరు మాత్రం ఒక్కటే. ఆయన ఎక్కడికి వెళ్లినా రోడ్లన్నీ నిండిపోవాల్సిందే. లేకుంటే ఆయన అడుగు పెట్టరు. ప్రజల్లో తమకు మద్దతు పెరుగుతోందని.. అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగిందని చూపించేందుకు తెగ తాపత్రయం పడుతున్నారు. తన టూర్ల నుంచి ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకుల వద్ద క్రెడిట్ కొట్టి, వచ్చే ఎన్నికల నాటికి దగ్గర రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో అనేక ఘటనలు జరిగాయి.. జరుగుతున్నాయి కూడా. హార్డ్ కోర్ కార్యకర్తలు మరణించిన ఉదంతాలు లేకపోలేదు. దీన్ని గమనించిన అధికార పార్టీ.. జగన్ టూర్ అనేసరికి పలు ఆంక్షలు పెడుతున్నారు. అయినా సరే నేతలు మాత్రం అస్సలు వినడంలేదు. ఫలితంగా పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కేసులు నమోదు అవుతున్నాయి.
జగన్ జిల్లాల టూర్లు.. ఆపై కేసులు
తాజాగా మంగళవారం కృష్ణా జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పోలీసులు ఆంక్షలు పెట్టిన గతంలో మాదిరిగా రోడ్లపై కార్యకర్తలతో నానా హంగామా చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే అనిల్.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని సీఐ చిట్టిబాబు కోరారు. అయినా ఏ మాత్రం పట్టించుకోలేదు, వారితో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు.
చివరకు వారి విధులకు ఆటంకం కల్పించారు. జగన్ టూర్‌లో చాలా చోట్ల ఆ తరహా నిబంధనలు అతిక్రమించారు. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఆ నేతలపై కేసులు నమోదు చేశారు పమిడిముక్కల పోలీసులు. డ్రోన్ ద్వారా చిత్రీకరణ చేసిన దృశ్యాల ద్వారా గుర్తించి మిగతా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు.
ALSO READ: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. పిడుగులతో కూడి వర్షం
కేవలం కృష్ణాజిల్లా మాత్రమే కాదు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం ఇలా ఏ జిల్లా చూసుకున్నా, అక్కడి నేతలపై కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. దీనిపై వైసీపీలో సీరియస్ చర్చ జరుగుతోంది. అధినేత పర్యటన ఏమోగానీ కేసుల్లో అడ్డంగా ఇరుక్కుంటున్నామని గుసగుసలు లేకపోలేదు.