World Cup 2025: భారత మహిళల క్రికెట్ చరిత్రలో హార్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ {ICC WOMENS World Cup 2025} ని కైవసం చేసుకుని దేశానికి అపూర్వ విజయాన్ని అందించింది. డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాని ఓడించి తొలి ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది. టీమిండియా సాధించిన ఈ చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపింది.
Also Read: Womens World Cup 2025: హర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా
అయితే కప్ గెలిచిన భారత జట్టుకు విక్టరీ పరేడ్ ఆనందం మాత్రం దక్కే అవకాశం కనిపించడం లేదు. భద్రతా కారణాల దృశ్య విజయోత్సవ ర్యాలీని రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} తాజాగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విక్టరీ పరేడ్ ఎందుకు నిర్వహించడం లేదో బీసీసీఐ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఏ రకమైన విక్టరీ పరేడ్ ప్రణాళికలు లేవు” అని స్పష్టం చేశారు. అయితే ఈ అపురూప సందర్భంలో విజయోత్సవ ర్యాలీని రద్దు చేయడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి పరేడ్ నిర్వహించి ఉంటే.. విజేతలకు, అభిమానులకు మధురానుభూతి దక్కేదని అభిప్రాయపడుతున్నారు. దేశ మహిళా క్రికెట్ కి ఇది ఓ చారిత్రాత్మక ఘట్టం అయినందువల్ల భద్రతా కారణాలను సమర్ధవంతంగా నిర్వహించి.. ఈ విజయాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది క్రీడాభిమానులు మాత్రం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన పొరపాటు కారణంగానే.. టీమిండియా మహిళలకు విక్టరీ పరీడ్ సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజెన్లు. అయితే విక్టరీ పరేడ్ విషయంలో బీసీసీఐ ప్రస్తుతం ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. 2025 ఐపీఎల్ అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ సందర్భంగా భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్‌ల బహుమతి!
అలాగే 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత బీసీసీఐ ఓ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సైకియా అధ్యక్షత వహిస్తున్నారు. కాగా విక్టరీ పరేడ్ రద్దయినప్పటికీ.. నేడు ఢిల్లీలో భారత మహిళా జట్టుకు ఘనమైన సన్మానం జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదిగా టీమిండియా ని సన్మానించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదిగా టీమిండియాని సన్మానించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నివాసంలో జరగనున్న ఈ కార్యక్రమంలో క్రీడాకారిణులకు ప్రత్యేక అభినందనలు దక్కనున్నాయి.