Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో అయితే ఎప్పుడు లేని విధంగా భారీ వర్షం దంచికొట్టింది.. ఎప్పుడు నీరు రానీ ప్రాంతంలో కూడా భారీ వరదలు వచ్చాయి. నిపుణులు చెప్పినట్లుగా నవంబర్ 4 న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవించాయి. అయితే నిన్న నాగర్‌కర్నూల్, హైదరాబాద్ అచ్చంపేట్, వనపర్తి, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నేడు పిడుగులతో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో నేడు భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..
తెలంగాణను వానదేవుడు పగబట్టినట్టుగా ఉన్నట్టుంది. ఈ సంవత్సరం వానలే వానలు.. అసలు వదలడం లేదు. ఈ వర్షాలు చాలా నష్టా్లు కూడా జరిగాయి. అంతేకాకుండా ప్రస్తుతం వానలు లేవు అనుకుంటే మళ్లీ ఇప్పుడు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Also Read: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
ఏపీలో ఆవర్తనం ఎఫెక్ట్.. ఇవాళ భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. రేపు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల కింద నిల్చోవద్దని సూచించారు.