Big TV Kissik Talks: రైతు బిడ్డగా అందరికీ ఎంతో సుపరిచితమైన పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big Tv Kissik Talks)కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత పల్లవి ప్రశాంత్ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రైతు బిడ్డనని తనకు అవకాశం కల్పించాలి అంటూ ఈయన బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని అందుకున్నారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత సింపతి డ్రామాలు ప్లే చేస్తూ విన్నర్ అయ్యారు అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒకవేళ పల్లవి ప్రశాంత్ విజేత అయితే ఆ డబ్బుతో ఏం చేస్తారు అనే ప్రశ్న ఎదురయింది.
ప్రైజ్ మనీ మొత్తం రైతులకే?
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ (Prize Money)మొత్తం రైతుల వ్యవసాయం కోసమే ఉపయోగిస్తానని చెప్పడంతో పల్లవి ప్రశాంత్ పట్ల అందరికీ మంచి అభిప్రాయం ఏర్పడటంతో పల్లవి ప్రశాంత్ ను బిగ్ బాస్ విన్నర్ గా నిలబెట్టారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ అందుకున్న ప్రైజ్ మనీ రైతులకు పంచకుండా సెలబ్రిటీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఈయనపై చాలామంది విమర్శలు కురిపించారు. తాజాగా ఈ విమర్శల పట్ల పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టారు.
పిల్లల్ని చదివిస్తున్న ప్రశాంత్?
చాలామంది నన్ను ఎన్నో రకాలుగా తిట్టారు అయితే నేను ఇలాంటి వాటిని పట్టించుకోనని కేవలం ఒక ధర్మాన్ని మాత్రమే నమ్ముతానని తెలిపారు. అందరూ నేను సహాయం చేయలేదని అనుకుంటున్నారు కానీ నేను చేసిన సహాయం ఎవరికి తెలియదని తెలిపారు. ఇప్పుడు ఫోన్ చేసిన నేను చేసిన సహాయం గురించి చెబుతారని పల్లవి ప్రశాంత్ తెలిపారు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మాస్టర్ ని కలవడంతో రైతులకు ఇలాంటి సహాయం చేద్దాం అని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా రైతులను కూడా తననే ఎంపిక చేయమని చెప్పానని పల్లవి ప్రశాంత్ తెలియజేశారు.
ఇకపోతే బిగ్ బాస్ ప్రైజ్ మనీలో కొంత భాగం కొంతమంది పిల్లల చదువు(Education) కోసం ఉపయోగిస్తున్నానని అసలు విషయం బయటపెట్టారు. ఒక చెల్లెలు చదువు కోసం నేను హెల్ప్ చేయగా ఆమె గత రెండు నెలల క్రితం ఫోన్ చేసి అన్న నువ్వు చేసిన సహాయం వల్ల ఈ రోజు నేను కాలేజీలో టాపర్ గా నిలిచానని చెప్పడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అయితే ఈ విషయాలు ఎవరికీ తెలియదని తెలిపారు. కేవలం బిగ్ బాస్ డబ్బులు మాత్రమే కాదు నేను షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్లిన వచ్చే డబ్బులలో కొంత భాగం ఇలాంటి సహాయాలు చేయడం కోసమే ఉపయోగిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అసలు విషయం తెలియజేశారు. అయితే ఒక మనిషిని మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలిసినప్పుడే మాట్లాడాలని, దయచేసి తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఇతరులను అవమానపరచొద్దు అంటూ ఈ సందర్భంగా ఈయన తనపై వచ్చిన విమర్శల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
Also Read: Big Tv Kissik Talks: ప్రశాంత్ సక్సెస్ ..ఆ అవమానమే కారణమా… చావు బ్రతుకుల మధ్య అలా..