BigTV English
Advertisement

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

America News: అమెరికాలో ట్రంప్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతు న్నారు. ఫలితంగా స్థానిక ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇప్పుటికే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత్ సంతతి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ విజయం సాధించారు. తాజాగా వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా హైదరాబాద్ మహిళ సత్తా చాటారు.


వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా డెమోక్రటిక్‌ అభ్యర్థి, భారత సంతతి మహిళ గజాలా హాష్మీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రేడియో షో హోస్ట్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ రీడ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. హాష్మీ ప్రస్తుతం 15వ సెనెటోరియల్‌కు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు వర్జీనియా సెనేట్‌లో పని చేసిన తొలి ముస్లిం మహిళ కూడా.


తొలి దక్షిణాసియా అమెరికన్ కూడా గజాలాయే. భారత సంతతికి చెందిన మహిళ మాత్రమేకాదు, హైదరాబాద్‌‌‌కి చెందిన వ్యక్తి.  గజాలా హాష్మీ ఎవరు? ఇంతకీ ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. 1964లో హైదరాబాద్‌లో జియా హాష్మీ-తన్వీర్‌ దంపతులకు జన్మించారు. గజాలా తన బాల్యమంతా హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లోని అమ్మమ్మ ఇంట్లో గడిపారు.

గజాలా హాష్మీ ఎవరు?  ఎక్కడ?

నాలుగేళ్ల వయసులో తన తల్లితో కలిసి అమెరికాకు పయనమయ్యారు. ఆ తర్వాత జార్జియాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. జార్జియా సదరన్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల బీఏ చదివారు. అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

గజాలా హష్మీ 30 సంవత్సరాల కిందట అజార్ రఫీక్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. యాస్మిన్-నూర్. గజాలా తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగి కూడా. మ్యారేజ్ తర్వాత అంటే గజాలా 1991లో రిచ్‌మండ్‌ ప్రాంతానికి వెళ్లిపోయారు.

ALSO READ:  న్యూయార్క్ మేయర్ ఎన్నికలు.. ట్రంప్‌కు ఝలక్, భారతీయుడికి పీఠం

మూడు దశాబ్దాల పాటు రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజీలో ప్రొఫెసర్‌గా మారారు. ఆ తర్వాత రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఆరేళ్ల కిందట అంటే 2019లో ఆమె తొలిసారిగా అమెరికా జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయం సాధించారు. 2024లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున సెనేట్‌ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

అమెరికాలో తుపాకీ హింసకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడారు. అసాల్ట్ రైఫిల్స్‌పై నిషేధం సహా ఆ తరహా ఆయుధాలపై కఠినమైన నియమాలను డిమాండ్ చేసిన అమెరికన్ రాజకీయ నాయకులలో ఆమె కూడా ఒకరు.  గజాలా తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేశారు.

Related News

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Big Stories

×