BigTV English

Sathyaraj : రజినీకాంత్ నేను అలా నటించడం ఇదే మొదటి సారి, ఎమోషనల్ అయిపోయిన కట్టప్ప

Sathyaraj : రజినీకాంత్ నేను అలా నటించడం ఇదే మొదటి సారి, ఎమోషనల్ అయిపోయిన కట్టప్ప

Sathyaraj : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులలో టాలెంటెడ్ నటుడు సత్యరాజ్. సత్యరాజ్ ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం. తమిళ్లో ఆయన హీరోగా కూడా చేసిన సినిమాలు ఉన్నాయి. సత్యరాజ్ తెలుగులో ఎన్ని పాత్రలు వేసిన కట్టప్ప పాత్ర మాత్రం ప్రత్యేకం. బాహుబలి సినిమాలో కట్టప్ప అనే పాత్ర చూపించిన ఇంపాక్ట్ మామూలుది కాదు. బాహుబలి సీక్వెల్ మీద అంచనాలు పెరగడానికి కూడా కారణం ఈ పాత్ర.


కేవలం బాహుబలి మాత్రమే కాకుండా తెలుగులో మిర్చి, ప్రతిరోజు పండగే, ప్రిన్స్ వంటి ఎన్నో సినిమాలలో ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో శృతిహాసన్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు సత్యరాజ్. కూలి సినిమా ఈవెంట్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది.

మొదటిసారి అలా నటించాను 


కూలి సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా హాజరైంది. ఈవెంట్లో సత్యరాజ్ మాట్లాడుతూ… “నేను రజనీకాంత్ తో ఇప్పటివరకు ఏడు సినిమాల్లో నటించాను, అన్ని పాత్రలు కూడా నెగిటివ్ క్యారెక్టర్స్. ప్రతి సినిమాలోని ఈయనకు విలన్ గా నటించా. కానీ మొదటిసారి కూలి సినిమాలో అతని ఫ్రెండులా నటించాను. రజనీకాంత్ చాలా అమేజింగ్ టాలెంటెడ్ స్టార్, ఆయన తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉండటం మనకి ఒక గిఫ్ట్ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ మాటలు రజిని అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. గతంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా వార్తల్లో వినిపించేవి. ఇప్పుడు సత్యరాజ్ మాటలతో వాటన్నిటికీ తెరపడింది అని చెప్పొచ్చు.

భారీ అంచనాలు 

కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి పాత్రకు లోకేష్ క్రియేట్ చేసిన ఇంపార్టెన్స్ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఈ సినిమా ఒక పవర్ఫుల్ స్క్రీన్ ప్లే తో ఉండబోతుంది అని అర్థమవుతుంది. మొత్తానికి సీనియర్ హీరోస్తో పనిచేస్తున్న లోకేష్ కనగరాజ్ వాళ్లకు ఏ స్థాయి హిట్ ఇవ్వాలో మంచి క్లారిటీతో ఉన్నాడు. అన్నిటినీ మించి ఈ ట్రైలర్ చివరలో భాషా సినిమాకు సంబంధించిన ఒక షాట్ పెట్టాడు. దీనితో ట్రైలర్ పైన విపరీతమైన హై వచ్చింది. చాలామంది ఇది ఒక్కటి చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది అంటూ కూలీ ట్రైలర్ పైన ట్వీట్స్ వేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి తెలుగు ఈవెంట్ కూడా జరుగుతుంది.

Also Read: Coolie Trailer: కూలీ ట్రైలర్ వచ్చేసింది, రజిని ఫ్యాన్స్ కు పూనకాలు

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×