ఒక రాజకీయ నాయకుడి పర్యటన ఎప్పుడు విజయవంతం అవుతుంది. ఆ పర్యటన వల్ల రాష్ట్రానికయినా, రాష్ట్ర ప్రజలకయినా ఉపయోగం కలిగినప్పుడు. కానీ సమయం సందర్భం లేకుండా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా టూర్ సూపర్ సక్సెస్ అంటూ వైసీపీ సోషల్ మీడియా బాకాలు ఊదుకుంటోంది. రైతులు బాధల్లో ఉన్నారు, వారిని పరామర్శించడానికి జగన్ వెళ్లారు. మరిక్కడ జగన్ టూర్ సక్సెస్ ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? అంటే రాజకీయంగా తమకు లాభసాటిగా ఉంది కాబట్టి ఆ టూర్ సక్సెస్ అని అంటున్నారా? వైసీపీ సోషల్ మీడియా పోస్టింగ్ ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైతులు కష్టాల్లో ఉంటే టూర్ సక్సెస్ అంటూ వైసీపీ పోస్టింగ్ లు పెట్టడమేంటని మండిపడుతున్నారు.
వైయస్ జగన్ గారి కృష్ణా జిల్లా టూర్ సూపర్ సక్సెస్
తుఫాన్ తో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి.. రైతులకి బాసటగా నిలిచిన వైయస్ జగన్ గారు
పంట నష్టపోయిన రైతుల్ని పట్టించుకోకుండా లండన్ చెక్కేసిన @ncbn.. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ముంబయికి @naralokesh
అన్నదాతల తరపున… pic.twitter.com/MN4ORRNAzQ
— YSR Congress Party (@YSRCParty) November 4, 2025
సక్సెస్ ఎవరికి?
జగన్ టూర్ సక్సెస్ అంటోంది వైసీపీ. సక్సెస్ అంటే ఏంటి? ఊహించని విధంగా జనం వచ్చారనా? అడుగడుగునా ప్లకార్డులు పట్టుకుని జగన్ కి జనం నీరాజనాలు పలికారనా? స్కూల్ కూడా ఎగ్గొట్టి చిన్నారులు జగన్ ర్యాలీలో పాల్గొన్నారనా? ఇవన్నీ కృత్రిమ ఎత్తుగడలు అని అందరికీ తెలుసు. జగన్ పరామర్శించాల్సింది రైతుల్ని. ఆ రైతులు తమ బాధలు జగన్ కి చెప్పుకుని ఉంటే, తండోపతండాలుగా రైతులు జగన్ ని చూడటానికి వస్తే, జగన్ యాత్ర వల్ల రైతులకు ఏదైనా మేలు జరిగి ఉంటే అప్పుడు ఆ టూర్ సక్సెస్ అయినట్టు. మరిక్కడ జగన్ టూర్ సక్సెస్ అని చెప్పుకోడానికి ఏముంది? పొలిటికల్ మైలేజ్ వచ్చింది కాబట్టి వైసీపీ జగన్ టూర్ సక్సెస్ అంటోంది. దీంతో నెటిజన్లు విమర్శలు మొదలు పెట్టారు. అంటే జగన్ రైతులకోసం రాలేదా, తన టూర్ సక్సెస్ చేసుకోవడం కోసం, పొలిటికల్ మైలేజ్ కోసమే జనంలోకి వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.
తుఫాన్ వేళ బెంగళూరులో..
ఏపీని మొంథా తుఫాన్ చుట్టుముట్టినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆయన బెంగళూరులో మకాం వేశారు. ఏపీకి రాలేదు. అక్కడక్కడా వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లి వారికి తోచిన సహాయం చేశారు. అటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించింది. అధికారులు, ప్రభుత్వ సిబ్బందితోపాటు కూటమి నేతలంతా ప్రజల్లోనే ఉన్నారు. స్థానిక నేతల్ని అప్రమత్తం చేసి, తుఫాన్ బాధితులకు సాయం చేయాలని సూచించారు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టాలు కనిష్టంగా మారాయి. ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టం మాత్రం జరిగింది. అయితే పంట నష్టానికి కేంద్ర సాయం కోరుతూ ప్రభుత్వం విజ్ఞప్తులు పంపించింది. అయితే ఇక్కడ జగన్ ఈ క్రాప్ నమోదు కాలేదంటూ విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జగన్ కి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
https://x.com/katchannaidu/status/1985738173776085473
ప్రభుత్వం పనిచేయలేదంటున్న జగన్ కి మంత్రి నారా లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే జగన్, ఎప్పుడూ జనం మధ్య ఉండే తమ ప్రభుత్వంపై వేలెత్తి చూపించడం సరికాదన్నారు. ఆయన తమవైపు ఒక వేలు చూపిస్తే, ఆయన వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. తుఫాన్ హెచ్చరిక వచ్చినప్పటి నుంచీ ఏపీలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు సీఎం చంద్రబాబు సహా, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది.. అందరూ ప్రజల చెంతే ఉన్నారని చెప్పారు లోకేష్. తీరిగ్గా ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చి విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు.
అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే @ysjagan గారు.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు. మీ వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు. తుఫాను హెచ్చరిక వచ్చిన నుంచీ సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్… pic.twitter.com/on4OcwzFs9
— Lokesh Nara (@naralokesh) November 4, 2025
Also Read: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్