ATHULYA RAVI (1)
Actress Athulya Ravi Stunning in White Saree: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తమిళ నటి అతుల్య రవి. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది.
ATHULYA RAVI (2)
కానీ, ఇందులో అతుల్య రవి యాక్టింగ్, గ్లామర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. చేసింది ఒక్క సినిమా అయినా మంచి గుర్తింపు పొందింది. షార్ట్స్ ఫిలింస్ తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలో వెండితెర ఎంట్రీ ఇచ్చింది.
ATHULYA RAVI (3)
పల్వాది కాదల్ అనే తమిళ షార్ట్ ఫిలింతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఇది మంచి విజయం సాధించడంతో ఆమె మూవీ ఆఫర్స్ తలుపుతట్టాయి. అలా 2017లో కాదల్ కన్ కట్టుదే అనే తమిళ్ సినిమాతో హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చింది.
ATHULYA RAVI (4)
ఆ తర్వాత 2018లో V. Z. దురై యేమాలిలో ప్రధాన పాత్రలో నటించింది. కోలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది. ఈ క్రమంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.
ATHULYA RAVI (5)
అప్పటి నుంచి ఈ అమ్మడికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వెండితెరపై సంప్రదాయ లుక్ లో ఆకట్టుకున్న ఈ భామ నెట్టింట మాత్రం ఫుల్ గ్లామర్ షో చేస్తుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోకుండ చేస్తుంది.
ATHULYA RAVI (6)
తాజాగా అతుల్య తెల్ల చీరలో హోయలు పోతూ ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఇందులో అందం, గ్లామర్ తో కుర్రకారు మతిపోగోడుతుంది. అబ్బా అతుల్య.. నీ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ATHULYA RAVI (7)
అతుల్య అసలు పేరు దివ్య. ప్రస్తుతం ఆమె తమిళంలో చెన్నై సిటీ గ్యాంగ్ స్టార్స్ అనే కామెడీ హేస్ట్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.